Stamina Increase Foods: కొద్దిపాటి వర్కవుట్స్‌కే అలసిపోతున్నారా.. ఇవి తిని స్టామినా పెంచుకోండి..!
Stamina Increase Foods: బాడీ ఫిట్‌గా ఉంచుకోవడానికి నేటి యువత రకరకాల వర్కవుట్స్ చేస్తుంది. కానీ కొంతమంది కొద్దిపాటి వర్కువుట్స్‌కే అలసిపోతారు.
Stamina Increase Foods: బాడీ ఫిట్‌గా ఉంచుకోవడానికి నేటి యువత రకరకాల వర్కవుట్స్ చేస్తుంది. కానీ కొంతమంది కొద్దిపాటి వర్కువుట్స్‌కే అలసిపోతారు. దీనికి కారణం వారి శరీరంలో శక్తి తక్కువగా ఉండటమే. ఈ పరిస్థితిలో వారు మంచి ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. తక్షణ శక్తిని పెంచే ఆహారాలు తినాలి. ఇందుకోసం కొంతమంది మార్కెట్‌లో లభించే కాప్సల్స్, ప్రొటీన్ పౌడర్ వంటి వాటిపై ఆధారపడుతారు. కానీ ఇవి అన్నివేళలా మంచివి కావు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే సహజసిద్దంగా స్టామినా పెంచే ఆహారాలు తీసుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
అరటిపండు
అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. వ్యాయామం చేసే ముందు అరటిపండును తీసుకుంటే అవి తక్షణ శక్తిని అందిస్తాయి. వ్యాయామం తర్వాత అరటిపండు తింటే అది మీ అలసటను తొలగిస్తుంది.
క్వినోవా
క్వినోవా సలాడ్ తయారు చేసుకోవచ్చు లేదంటే నేరుగా తినవచ్చు. ఈ రెండు సందర్భాల్లోను మంచి ప్రయోజనాలు ఉంటాయి. వ్యాయామం చేసిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తే ప్రతిరోజూ క్వినోవా తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
పప్పులు
పప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, ఐరన్ అలసటను దూరం చేస్తాయి. దీని వల్ల ఎక్కువసేపు వ్యాయామం చేయగలుగుతారు.
గింజలు, విత్తనాలు
బాదం, వాల్‌నట్‌లు, ఇతర విత్తనాలు శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్‌లను కలిగి ఉంటుంది. ఇవి శక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. అందుకే గింజలు ప్రతిరోజూ తీసుకోవాలి.