Rain Water Disease: వర్షపు నీటిలో తడుస్తున్నారా.. జలుబు, దగ్గు కాకుండా వీటి ప్రమాదం ఎక్కువ..!

Rain Water Disease: దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.

Update: 2023-07-18 05:18 GMT

Rain Water Disease: వర్షపు నీటిలో తడుస్తున్నారా.. జలుబు, దగ్గు కాకుండా వీటి ప్రమాదం ఎక్కువ..!

Rain Water Disease: దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి సీజనల్‌ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా వర్షంలో తడవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వర్షం నీటి వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్, ట్రాకోమా (కంటి ఇన్ఫెక్షన్), ఫోలిక్యులిటిస్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియా బారిన పడతారు. దీని వల్ల చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు ఏర్పడతాయి. వర్షం నీటిలో తడవడం వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం.

1. అతిసార వ్యాధి

వర్షపు నీటిని మింగడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. అలాగే ఇ.కోలి, షిగెల్లా, వైబెరో కలరా, నోరోవైరస్, హెపటైటిస్ వైరస్‌లు దాడి చేస్తాయి. హెపటైటిస్ వైరస్ వల్ల కాలేయ వ్యాధులు సంభవిస్తాయి. నోరోవైరస్ కడుపు వ్యాధికి కారణమవుతుంది. దీని వల్ల పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2. చెవి ఇన్ఫెక్షన్

వర్షపు నీరు చెవిలో చేరి ఎక్కువసేపు ఉంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది చెవిలో ఎరుపు, దురద, వాపుకు కారణమవుతుంది. చెవిలో వర్షం నీరు చేరితే ఇన్ఫెక్షన్ సోకుతుంది.

3. యూటీఐ ఇన్‌ఫెక్షన్

వర్షపు నీటి వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కలుషిత నీటి నుంచి బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి వెళ్లడం వల్ల ఇది జరుగుతుంది. ఇది యూటీఐ ఇన్‌ఫెక్షన్‌కి కారణమవుతుంది. దీని కారణంగా మూత్రానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. మూత్రం సక్రమంగా రాకపోవడమే కాకుండా మంట వస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

Tags:    

Similar News