White Bread Side Effects: టిఫిన్‌గా వైట్ బ్రెడ్ తింటున్నారా.. ఈ వ్యాధులని కొని తెచ్చుకున్నట్లే..!
White Bread Side Effects: ఈ రోజుల్లో చాలామంది ఉదయం పూట టిఫిన్‌గా వైట్ బ్రెడ్ తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
White Bread Side Effects: ఈ రోజుల్లో చాలామంది ఉదయం పూట టిఫిన్‌గా వైట్ బ్రెడ్ తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆఫీసుకు లేదా పాఠశాలకు వెళ్లేటప్పుడు హడావిడిగా తింటున్నారు. దీంతో రకరకాల వ్యాధులని కొని తెచ్చుకుంటున్నారు. ఉదయం ఇంట్లో టిఫిన్ రెడీ చేయడానికి బద్దకంగా ఉండే వ్యక్తులు ఎక్కువగా వైట్ బ్రెడ్‌పై ఆధారపడుతున్నారు. కానీ దీనివల్ల చాలా హాని జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నారు. వైట్ బ్రెడ్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
1. అధిక మొత్తంలో ఉప్పు
వైట్ బ్రెడ్ తయారీలో ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే వీటిని చాలాకాలం మార్కెట్లో విక్రయించేందుకు ఉపయోగిస్తారు. కానీ ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే రక్తపోటును పెంచుతాయి. వైట్ బ్రెడ్ ఎక్కువగా తినేవారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
2. బరువు పెరుగుతారు
వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్, శుద్ధి చేసిన చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజు దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి, కొవ్వు వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా మధుమేహం, ఊబకాయం తలెత్తుతాయి.
3. గుండెకి చాలా నష్టం
బ్రెడ్ లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ పెరిగే ప్రమాదం పొంచి ఉంది. అధిక రక్తపోటు వల్ల గుండెకి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల కొరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, గుండెపోటు వంటి ప్రమాదం ఉంటుంది. వైట్ బ్రెడ్‌కి బదులుగా తృణధాన్యాలు తీసుకోవడం ఉత్తమం.