Eating Leftover Food: రాత్రి మిగిలిపోయిన ఆహారం తింటున్నారా.. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఫుడ్ పాయిజనింగ్ ఎందుకంటే..?
Eating Leftover Food: కొంతమంది రాత్రి మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉదయాన్నే మళ్లీ వేడిచేసి తింటారు. డబ్బులు ఆదా చేయడానికి, ఆహారపదార్థాలను వేస్ట్ చేయకూడదనే వీరి ఆలోచన బాగానే ఉంది.
Eating Leftover Food: కొంతమంది రాత్రి మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉదయాన్నే మళ్లీ వేడిచేసి తింటారు. డబ్బులు ఆదా చేయడానికి, ఆహారపదార్థాలను వేస్ట్ చేయకూడదనే వీరి ఆలోచన బాగానే ఉంది. కానీ ప్రతి ఆహారం ఇలా తినడం వల్ల తర్వాత ఆస్పత్రి బిల్లు చెల్లించలేక అవస్థపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని మిగిలిపోయిన ఆహారాలు చాలా ప్రమాదకరం. ఇవి బ్యాక్టీరియాతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని సరిగ్గా స్టోర్ చేయకపోతే లేదా సరిగ్గా వేడి చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
ఆహారాన్ని ఎంత త్వరగా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి..?
బాక్టీరియా వంటశాలలతో పాటు ప్రతిచోటా ఉంటాయి. ఇది తేమ, ఉష్ణోగ్రతతో వేగంగా వృద్ధి చెందుతుంది. 20 నిమిషాల్లో సంఖ్య రెట్టింపు అవుతుంది. అందుకే మిగిలిన ఆహారాన్ని వీలైనం త త్వరగా దాదాపు రెండు గంటలలోపు ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో ఉంచడం ముఖ్యం. అలాగే మిగిలి పోయిన ఆహారం గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి. దీనివల్ల దానికి గాలి తగలకుండా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది.
ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం ఎంత సమయం సురక్షితం..
మీ ఫ్రిజ్‌ను సున్నా నుంచి ఐదు డిగ్రీల టెంపరేచర్ మధ్య ఉంచండి. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత మిగిలిపోయిన ఆహారంలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టిన మిగిలిపోయిన ఆహారాన్ని రెండు రోజుల్లోపు తినాలి. తర్వాత హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి సమయం లభిస్తుంది. వాస్తవానికి లిస్టెరియా వంటి జెర్మ్స్ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతలో కూడా పెరుగుతాయి. రెండు రోజులు దాటితే మరింత పెరిగే అవకాశం ఉంది.
మిగిలిపోయిన ఆహారం మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా..
మీరు మిగిలిపోయిన ఆహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయకూడదు. ఆహారాన్ని వేడి చేసి చల్లబరిచినప్పుడల్లా హానికరమైన బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు బ్యాక్టీరియాను చంపడం కష్టమవుతుంది.