Health Tips: తినేటప్పుడు ఎక్కువ నీరు తాగుతున్నారా.. అయితే, మీకో షాకింగ్ న్యూస్..!

Water Benefits: ఆహారంతో పాటు నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.

Update: 2023-04-19 15:30 GMT

Health Tips: తినేటప్పుడు ఎక్కువ నీరు తాగుతున్నారా.. అయితే, మీకో షాకింగ్ న్యూస్..!

Water Benefits: ఆహారంతో పాటు నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది నీరు తాగకుండా ఆహారం మింగలేరు. భోజనం చేస్తున్నప్పుడు ఒకటి లేదా రెండు సార్లు నీరు తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదు. అయితే, ఎక్కువ నీరు తాగడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం జీర్ణం కావడానికి నీరు సహాయపడినప్పటికీ, ఆహారం తినే సమయంలో నీరు తాగడం వల్ల చాలా వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు నీరు లాంటి ద్రవాలను తీసుకోవడం జీర్ణక్రియపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందంట. ఈ కారణంగా, మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారం తినేమందు ముప్పై నిమిషాల ముందు.. ఆహారం తిన్నాక ముప్పై నిమిషాల తర్వాత ఒక గ్లాసు నీరు తాగాలి. జీర్ణక్రియ సమయంలో కడుపులో ఉండే యాసిడ్ మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ, మీరు ఆహారంతో పాటు నీరు తాగితే, అది మీ కడుపులోని యాసిడ్‌ను పలుచన చేస్తుంది. ఇది జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మన తిన్న ఆహారం పొట్టలో ఉండే ఆమ్లాలు, ఎంజైమ్‌లతో చాలా తక్కువ సమయం పాటు సంబంధం కలిగి ఉంటుంది.

జీర్ణక్రియపై చెడు ప్రభావం..

ఆహారంతో పాటు నీరు తాడగం వల్ల జీర్ణక్రియపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తినే సమయంలో నీరు తాగడం వల్ల, ఆహారం సరిగ్గా జీర్ణంకాదు. అయితే, తినక ముందు, తర్వాత నీరు తాగటం జీర్ణక్రియపై ప్రభావం చూపదని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఎసిడిటీ..

చాలా మంది ఆహారం తినే సమయంలో నీరు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందని నమ్ముతారు. అయితే దీని గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందా లేదా అనేది కనుక్కోవడం చాలా కష్టం.

బరువులో మార్పులు..

నీటి గురించి మరొక సాధారణ అపోహ కూడా ఉంది. ఇది కడుపులోని ద్రవాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అంటుంటారు. శరీరంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచడం ద్వారా బరువు పెరుగుటకు దారితీస్తుందని చెబుతుంటారు. భోజనం సమయంలో నీరు తాగడం హానికరం అని సూచించే అనేక వెబ్‌సైట్‌లు.. ఇది బరువు పెరుగుటానికి దారితీస్తుందని చెబుతున్నాయి. కానీ దాని గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం కనుగొనబడలేదు. ఆహారంతో పాటు జ్యూస్, చక్కెర పానీయాలు వంటి ఇతర రకాల ద్రవాలను తాగడం మంచిది కాదు. ఎందుకంటే అవి చాలా అనారోగ్యకరమైనవి, అవి బరువు పెరగడానికి కూడా దారితీస్తాయి.

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?

నిజానికి ఆహారంతో పాటు నీరు తాగడం ప్రమాదకరమని ఇంతవరకు ఎలాంటి పరిశోధనలు తెరపైకి రాలేదు. ఆహారంతో పాటు నీరు తాగడం జీర్ణక్రియ, కడుపు ఆమ్లం, ఎంజైమ్‌లపై చెడు ప్రభావం చూపుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ఇటువంటి పరిస్థితిలో, మీరు ఆహారం తినేటప్పుడు నీరు తాగాలా వద్దా అనేది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. ఆహారం తినే సమయంలో నీరు తాగడం వల్ల ఏదైనా సమస్య ఎదురైతే ఆహారం తిన్న తర్వాత కూడా తాగవచ్చు.

Tags:    

Similar News