Health Tips: తరచుగా ఒత్తిడికి గురవుతున్నారా.. ఉపశమనం కోసం ఇలా చేయండి..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది కుటుంబం, ఉద్యోగం అంటూ ఒత్తిడిలో జీవిస్తున్నారు.

Update: 2023-03-26 14:30 GMT

Health Tips: తరచుగా ఒత్తిడికి గురవుతున్నారా.. ఉపశమనం కోసం ఇలా చేయండి..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది కుటుంబం, ఉద్యోగం అంటూ ఒత్తిడిలో జీవిస్తున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. తరచుగా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే మీ గురించి మీరు కాస్త పట్టించుకోవాలి. లేదంటే డిప్రెషన్‌లోకి వెళుతారు. ఇలాంటి సమయంలో శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోవాలి. ఒత్తిడి, టెన్షన్ ఏ విధంగా తగ్గించుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

వ్యాయామం చేయండి

రోజులో కొంత సమయం పాటు వ్యాయామం చేయాలి. ఇది మనస్సుకు విశ్రాంతినిస్తుంది. అంతేకాదు ఒత్తిడి, టెన్షన్ దూరమవుతుంది. ఇందుకోసం వర్కవుట్, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.

కండరాల రిలాక్స్

శరీరంలోని కండరాలకి విశ్రాంతినిస్తే ఒత్తిడి దానంతట అదే తగ్గుతుంది. దీని కోసం స్ట్రెచింగ్, మసాజ్, రాత్రి మంచి నిద్ర వంటివి ఉపయోగపడుతాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పోతుంది. మంచి అనుభూతి చెందుతారు.

లోతైన శ్వాస తీసుకోండి

తరచుగా ఒత్తిడికి గురవుతుంటే లోతైన శ్వాస తీసుకోవాలి. దీని కోసం ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.

ఒత్తిడి పనులు చేయవద్దు

తరచుగా ఒత్తిడికి గురవుతున్నట్లయితే వాటికి కారణాలు అన్వేషించాలి. ఒత్తిడిని ప్రేరేపించే పనులని చేయకూడదు. కొన్ని రోజులు విరామం తీసుకుంటే అంతా కుదుటపడుతుంది. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

ఒత్తిడిని అంగీకరించండి

మీరు తరచుగా ఒత్తిడికి లోనవుతున్న విషయాన్ని అంగీకరించాలి. దీనివల్ల వేరే మార్గాలపై దృష్టి సారిస్తారు. ఒత్తిడికి గురయ్యే పనులని చేయరు. ఇలా చేయడం వల్ల మీ మనుసు రిలాక్స్ అవుతుంది.

పాటలు వినండి

ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ఇష్టమైన పాటలని వినాలి. ఎందుకంటే సంగీతం వినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనుసుకి ప్రశాంతత దొరుకుతుంది. 

Tags:    

Similar News