Soaked Moong Dal: నానబెట్టిన పెసర్లు తింటే అద్భుత ప్రయోజనాలు.. ఈ రోగులకి దివ్యవౌషధం..!
Soaked Moong Dal: Soaked Moong Dal: ఉదయాన్నే నానబెట్టిన పెసర్లు తింటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.
Soaked Moong Dal: ఉదయాన్నే నానబెట్టిన పెసర్లు తింటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వివిధ రకాల రోగాలని నయం చేస్తాయి. ఇందులో విటమిన్లు A, B, C అనేక రకాల ఖనిజాలు, ప్రొటీన్స్ ఉంటాయి. ఉదయాన్నే తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
సులభంగా జీర్ణం
పెసర్లని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. వీటివల్ల జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకే ప్రతిరోజు నానబెట్టిన పెసర్లు తినడం అలవాటు చేసుకోవాలి.
ప్రోటీన్ పుష్కలం
నానబెట్టిన పెసర్లలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీర కండరాలకు చాలా మేలు చేస్తుంది. రోజూ తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టుకు తగినంత పోషణ లభిస్తుంది.
బరువు తగ్గడం
మీరు బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో నానబెట్టిన పెసర్లని చేర్చుకోవాలి. వీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని శాంతపరచడానికి పనిచేస్తుంది. అందుకే బరువు తగ్గేందుకు వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.
గుండె ఆరోగ్యం
నానబెట్టిన పెసర్లలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి పని చేసే కరిగే ఫైబర్‌లను కలిగి ఉంటాయి. హార్ట్ పేషెంట్ అయితే తప్పనిసరిగా పెసర్లని డైట్‌లో చేర్చుకోవాలి.