Alert: గర్భిణులకి అలర్ట్‌.. ఈ మూడు టీకాలు వేయించుకున్నారా..!

Alert: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

Update: 2023-06-05 13:56 GMT

Alert: గర్భిణులకి అలర్ట్‌.. ఈ మూడు టీకాలు వేయించుకున్నారా..!

Alert: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. దీని వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. గర్భధారణ సమయంలో అధిక బీపీ, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే టీకాలు సకాలంలో వేస్తే వ్యాధులను సులభంగా నివారించవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ రక్షణ లభిస్తుంది. పుట్టిన తర్వాత పిల్లలలో వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తప్పనిసరిగా టీకాలు వేయాలని వైద్యులు తరచూ గుర్తుచేస్తుంటారు. ప్రతి గర్భిణీ తప్పనిసరిగా తీసుకోవలసిన మూడు టీకాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఇన్ఫ్లుఎంజా టీకా

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకి వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఫ్లూ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాను గర్భధారణ సమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. టీకా తీసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ కూడా ఇన్ఫ్లుఎంజా నుంచి రక్షించబడుతుంది.

ధనుర్వాతం టీకా

గర్భధారణ సమయంలో టెటానస్ టీటీ-1 టీకా వేయాలి. ఈ వ్యాక్సిన్‌ను ప్రారంభంలో ఎప్పుడైనా వేయించుకోవచ్చు. నాలుగు నుంచి ఐదు వారాల విరామం తర్వాత TT-2 వ్యాక్సిన్‌ను పొందాలి. ఈ వ్యాక్సిన్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

హెపటైటిస్-బి వ్యాక్సిన్

హెపటైటిస్-బి వ్యాక్సిన్ కాలేయ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. వైద్యుల సలహా మేరకు ఈ టీకా వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల బిడ్డకు రక్షణ లభిస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

గర్భిణులు డాక్టర్ సలహా తర్వాత మాత్రమే ఏదైనా టీకా తీసుకోవడం ఉత్తమం. ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, శరీరంలో నొప్పి ఏదైనా ఇతర దుష్ప్రభావాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గర్భిణులు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో టీకాలు తీసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో టీకాలు వేయించుకోవాలంటే ప్రసవ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. టీకా తీసుకున్న తర్వాత దాని పూర్తి కోర్సును పాటించాలి. సరైన సమయంలో మిగిలిన వ్యాక్సిన్‌లను తీసుకోవాలి.

Tags:    

Similar News