Diabetic Patients: డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. చలికాలంలో వీటిని కచ్చితంగా తినాలి..!
Diabetic Patients:దేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడమే.
Diabetic Patients: దేశంలో డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. దీంతో చిన్నవయసులోనే డయాబెటీస్ బారినపడుతున్నారు. ఈ వ్యాధి నయం కాదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెడితే అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో జీవక్రియలు మందగిస్తాయి. ఈ పరిస్థితిలో మీరు కూడా మధుమేహంతో బాధపడుతున్నట్లయితే డైట్‌లో వీటిని చేర్చుకోండి.
మిల్లెట్
చలికాలం డైట్‌లో మిల్లెట్‌తో చేసిన ఆహారాలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మిల్లెట్ నుంచి రోటీ, కిచ్డీని తయారు చేసి తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు వీటిని రోజూ తీసుకుంటే ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. తెలియజేద్దాం.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే దీనిని ప్రతిరోజు తీసుకోవాలి. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కావాలంటే టీలో కూడా చేర్చుకోవచ్చు.
ఉసిరి
మధుమేహ రోగులకు ఉసిరి చాలా మేలు చేస్తుంది. ఇందులో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. అందువల్ల దినచర్యలో రోజు ఒక ఉసిరికాయ తినాలి.
క్యారెట్
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్ అయితే ప్రతిరోజూ క్యారెట్ తినవచ్చు. దీని రసం కూడా తాగవచ్చు. లేదా సలాడ్‌లో వినియోగించవచ్చు.