Diabetes Sufferers: మధుమేహ బాధితులకి అలర్ట్‌.. ఈ కారణాల వల్ల పాదాలలో నొప్పి..!

Diabetes Sufferers: భారతదేశంలో రోజు రోజుకి మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారు. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి.

Update: 2023-08-15 16:00 GMT

Diabetes Sufferers: మధుమేహ బాధితులకి అలర్ట్‌.. ఈ కారణాల వల్ల పాదాలలో నొప్పి..!

Diabetes Sufferers: భారతదేశంలో రోజు రోజుకి మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారు. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. దీనివల్ల దీర్ఘకాలికంగా బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల చాలామంది డయాబెటిక్ రోగులకి పాదాలలో నొప్పి వస్తుంది. దీనికి కారణం చెడు అలవాట్లు. అలాగే శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. మీరు కాళ్ల నొప్పులని వదిలించుకోవాలంటే వెంటనే ఈ అలవాట్లను మార్చుకోండి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

చెక్‌ బ్లడ్ షుగర్ లెవెల్

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే బ్లడ్ షుగర్ లెవెల్ పై నిఘా ఉంచడం అవసరం. అప్పుడే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోగలుగుతారు. దీని కోసం మార్కెట్ నుంచి గ్లూకోమీటర్‌ను కొనుగోలు చేయండి. దీనిద్వారా తరచుగా బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేసుకోండి. అలాగే వైద్యుల సలహా తీసుకుంటూ ఉండాలి. దీంతో పాదాల నొప్పులు పెరగడాన్ని అరికట్టవచ్చు.

డీహైడ్రేషన్‌కి గురికావొద్దు

శరీరం సక్రమంగా పనిచేయడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ కండరాల నొప్పికి కారణం అవుతుంది. దీన్ని నివారించడానికి కొబ్బరి నీరు, సాధారణ నీరు, తాజా పండ్ల రసం తాగుతూ ఉండాలి.

అనారోగ్యకరమైన ఆహారం తినవద్దు

మధుమేహ వ్యాధిగ్రస్తులు అనారోగ్యకరమైన వాటిని తినకూడదు. ఆయిల్, స్పైసీ ఫుడ్ తీసుకుంటే పాదాలలో నొప్పి, వాపును పెంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. అందులో తక్కువ మసాలా ఉండేవిధంగా చూసుకోవాలి. వంట కోసం ఆలివ్ నూనె ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

సిగరెట్, బీడీ తాగవద్దు

సిగరెట్, బీడీ, హుక్కా తాగడం అందరికీ హానికరం. డయాబెటిక్ పేషెంట్ ధూమపానం చేయడం వల్ల రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి. ఇది పాదాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఉండాలి.

Tags:    

Similar News