Health Tips: వంటింట్లో లభించే ఈ మసాల దినుసు కడుపునొప్పికి దివ్యవౌషధం.. చిటికెలో ఉపశమనం..!

Health Tips: కొంతమంది తరచుగా కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది.

Update: 2023-10-04 14:30 GMT

Health Tips: వంటింట్లో లభించే ఈ మసాల దినుసు కడుపునొప్పికి దివ్యవౌషధం.. చిటికెలో ఉపశమనం..!

Health Tips: కొంతమంది తరచుగా కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు కడుపునొప్ప దానంతట అదే తగ్గిపోతుంది. మరికొన్నిసార్లు ఎంతకీ తగ్గదు మందులు వేసుకోవాల్సిందే. అయితే తరచుగా కడుపునొప్పితో బాధపడేవారు ఇంటి చిట్కాలతో సులువుగా నయం చేసుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సాధారణంగా వంటల రుచిని పెంచడానికి మసాలాలను ఉపయోగిస్తాం. కానీ వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో వాము ఒకటి. ఇందులో చాలా రకాలా ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది.ఇది ఔషధం కంటే తక్కువేమి కాదు. ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. దీని సహాయంతో కడుపునొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు.

తరచుగా గ్యాస్ కారణంగా కడుపు నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే చెంచా వాము పొడిని తీసుకొని నేరుగా నమిలి తినాలి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కానీ మీరు క్షణంలో ఉపశమనం పొందుతారు. కడుపునొప్పి సమస్య తీవ్రంగా ఉంటే ఒక గ్లాసు నీటిలో కొంచెం వాము పొడి వేసి గోరు వెచ్చగా వేడిచేసి ఆ నీటిని తాగాలి. కడుపు నొప్పికి చిటికెలో తగ్గుతుంది. భారతదేశంలో ఆయిల్, స్పైసీ ఫుడ్ తినే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు ఎదురవుతాయి. 1 గ్రాము వాము తీసుకొని బాదంతో నమిలి తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి మంచి ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News