Heart Disease: ఈ బ్లడ్‌ గ్రూప్‌ వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ..!

Heart Disease: గుండె శరీరంలో చాలా ప్రధాన అవయవం. దీనిని సరిగా చూసుకోపోతే చాలా ప్రమాదం జరుగుతుంది.

Update: 2023-09-30 16:00 GMT

Heart Disease: ఈ బ్లడ్‌ గ్రూప్‌ వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ..!

Heart Disease: గుండె శరీరంలో చాలా ప్రధాన అవయవం. దీనిని సరిగా చూసుకోపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. నేటి కాలంలో చాలామంది గుండె జబ్బులకు గురవుతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి పాటించకపోవడం. ముఖ్యంగా యువకులు గుండెపోటుకు గురై అర్ధాంతరంగా చనిపోతున్నారు. అందుకు గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

గుండె సంబంధిత వ్యాధులు జీవనశైలి లేదా జన్యుశాస్త్రంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్నిసార్లు బ్లడ్ గ్రూప్ కారణంగా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్లడ్ గ్రూప్, గుండె సంబంధిత వ్యాధులపై నిర్వహించిన పరిశోధనలో కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. పరిశోధన ప్రకారం A, B బ్లడ్ గ్రూప్‌ల వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది.ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి.

ఏ వ్యక్తులు తక్కువ ప్రమాదంలో ఉన్నారు?

ఇందుకు సంబంధించి దాదాపు 4 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా ఉన్నట్లు తేలిందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం 10 శాతం తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. హెల్తీ డైట్ తీసుకోవడంతో పాటు వర్కవుట్స్ చేయడం చాలా ముఖ్యం.

Tags:    

Similar News