Cough: చలికాలంలో దగ్గు వేధిస్తోందా..ఈ సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి..చిటికెలో సమస్యలన్నీ మాయం
Cough: చలికాలం వచ్చిందంటే ఎన్నో వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒంటినొప్పులు వంటివి చాలా మంది ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ సీజన్ లో వాతావరణం సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా మారతుుంది. దీంతో ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇదే సమయంలో వీటిని ఎదుర్కొనేందుకు మన శరీరం రోగనిరోధకశక్తిని పెంచుకుంటుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచి వైరస్ లను కూడా అడ్డుకుంటుంది. అయితే ఆ ప్రాసెస్ లో ముక్కుదిబ్బడ, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోవడంతో ఆస్తమా, దగ్గ వంటికి ఇబ్బందిపెడుతాయి. ఇలాంటప్పుడు కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తింటే దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు. ఇలాంటి లక్షణాలున్న సూపర్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
వెల్లుల్లి:
వెల్లుల్లోి అనేక రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం దగ్గును మరింత తగ్గిస్తుంది. చలికాలంలో వెల్లుల్లి రెబ్బలు తింటే లేదంటే నువ్వుల నూనెలో ఉడికించి ఆ మిశ్రమాన్ని ఛాతీ,గొంతుపై అప్లయ్ చేసుకుంటే దగ్గు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
అల్లం:
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని జింజరాల్ సమ్మేళనం నాశికా రంధ్రాల కండరాలకు ఉపశమనం కల్పించి నాజిల్ బ్లాక్ ను తొలగిస్తుంది. దీంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడుతుంది. రోజుకు 3 సార్లు అల్లం టీ తాగితే దగ్గు సమస్యలను దూరం పెట్టవచ్చు.
చికెన్ సూప్:
దగ్గు ఉన్నప్పుడు చికెన్ సూప్ తాగాలని వైద్యులు చెబుతుంటారు. చికెన్ వండేటప్పుడు విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శ్వాస నాళాన్ని క్లీన్ చేసి దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంటాయి. శ్వాస సులువుగా పీల్చుకునేలా బ్లాకేజీని క్లియర్ చేసి ఇమ్యూనిటీని పెంచుతాయి.
పసుపు పాలు:
దగ్గు నివారణకు పసుపు పాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. పసుపులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు శ్వాసనాళాల బ్లాకేజీలను క్లియర్ చేస్తాయి. యాంటీ మైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంటాయి. గ్లాసుపాలలో చిటికెడ్ పసుపు వేసి మరిగించి పడుకునే ముందు తాగితే జలుబు దగ్గు, గొంతు నొప్పి మటుమాయం అవుతుంది.
సిట్రస్ పండ్లు :
నిమ్మకాయలు, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి వంటి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బలపరిచి దగ్గును దూరం చేస్తుంటాయి. సిట్రస్ పండ్లను నేరుతా తిన్నా లేదంటే జ్యూస్ చేసుకుని తాగినా ప్రయోజనాలు ఉంటాయి. ఈ సీజన్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా చేపలు తింటుండాలి. ఒమేగా 3 ఆమ్లాలో బలమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి.