సీతకోకచిలకకి ఎగరటం నేర్పిన దర్శకుడి పుట్టినరోజు నేడు.

Update: 2019-07-17 08:42 GMT

సీతకోకచిలకకి ఎగరటం నేర్పిన దర్శకుడి పుట్టినరోజు నేడు.

తమిళ సినిమా దర్శకుడు అయిన కూడా తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించినా దర్శకుడి పుట్టినరోజు ఈ రోజు. ఎర్ర గులాబీలు సినిమాతో ఆ నాటి యువకులను ఉర్రుతలుగించాడు. సీతాకోకచిలుక సినిమాతో ప్రేమలోని మధురాన్ని తెలుగు వారికి పంచిన రాజా... పుట్టినరోజు ఈ రోజు. ఆయనే మన భారతీరాజా! ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. అలాగే భారతి రాజా మంగమ్మగారి మనవడుచిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించాడు. ఇంకా...టిక్ టిక్ టిక్, జమదగ్ని, ఆరాధన,కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు లాంటి సీనిమాలను అందించాడు. 2004 లో పద్మశ్రీ వచ్చింది వీరికి.

Tags:    

Similar News