ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... 12 మంది నక్సల్స్ మృతి, మృతుల్లో DVC ర్యాంక్ నక్సలైట్స్?

Update: 2025-01-16 15:46 GMT

Chhattisgarh encounter news: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్ ఆపరేషన్‌లో ఉన్న భద్రతా బలగాలకు నక్సలైట్లు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఎన్డీటీవీ కథనం తెలిపింది.

గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం చీకటి పడే వరకు 10 గంటలకుపైగా ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లోనే నలుగురు నక్సలైట్స్ చనిపోయారు. చనిపోయిన వారిలో డివిజినల్ కమిటీ మెంబర్ స్థాయి (DVC rank naxalite) నక్సలైట్స్ కూడా ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రత బలగాల వైపు నుండి మూడు జిల్లాలకు డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ బలగాలు పాల్గొన్నాయి. వీరితో పాటు సీఆర్పీఎఫ్‌లో జంగిల్ వార్ ఫేర్ యూనిట్స్‌గా పేరున్న 5 COBRA బలగాలు (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), సీఆర్పీఎఫ్‌కు చెందిన 229వ బెటాలియన్ బలగాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌లో ఉండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ జరగడం ఇది రెండోసారి. జనవరి 12న జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. 

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.   

Tags:    

Similar News