ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
Infosys Narayana Murthy about freebies: ఉచిత పథకాలతో పేదరికంపై విజయం సాధించిన దేశమే లేదు- నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు

ఉచిత పథకాలతో పేదరికంపై విజయం సాధించిన దేశమే లేదు - నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
Infosys Narayana Murthy about freebies in India: ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఉచితాలతో పేదరికాన్ని పోగొట్టలేరని అన్నారు. పేదరికం నిర్మూలనకు ఉచితాలు పరిష్కారం కావని సూచించారు. అలా ఉచితాలతో అభివృద్ధి సాధించిన దేశం ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉచితాలు ఇవ్వడానికి బదులు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రోత్సాహకాలు అందించాలని అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన వ్యవస్థాపకుల సమావేశంలో నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉచితాలను విమర్శిస్తూ ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడాన్ని ఆయన ప్రస్తావించారు. అలా ఉచిత విద్యుత్ లబ్ధి పొందే కుటుంబాల వద్దకు వెళ్లి ర్యాండం సర్వే నిర్వహించాలన్నారు. ఆ కుటుంబాల్లో పిల్లలు బాగా చదువుతున్నారా అని ఆరా తీయాలన్నారు. లేదంటే పిల్లల వికాసం పట్ల ఆ కుటుంబాల్లో ఆసక్తి ఏమైనా పెరిగిందా లేదా అని కనుక్కోవాలన్నారు.
ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు అభిప్రాయం
ప్రభుత్వాలు ఉచిత పథకాలు ప్రకటించడాన్ని సుప్రీం కోర్టు కూడా గతంలోనే తప్పుపట్టింది. ఉచితంగా రేషన్, ఉచితంగా డబ్బులు వస్తుండటంతో జనం పనిచేయడానికి సిద్ధంగా లేరని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. గత నెలలో ఒక పిటిషన్‌పై వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు వైరల్
గతేడాది ఒక సమావేశంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ "ఉత్పత్తిని పెంచడం కోసం యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలి" అని అన్నారు. ఆయన లేవనెత్తిన ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసిన విషయం తెలిసిందే. ఇంకొంతమంది ఎంటర్ ప్రెన్యువర్స్ మాట్లాడుతూ వారానికి 90 గంటలు పని చేయాలని అన్నారు. వారు చేసిన ఈ వ్యాఖ్యలకు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ కొంతమంది ప్రముఖులు అభిప్రాయపడ్డారు. వారానికి 90 గంటలు పనిచేస్తూ సంస్థకే అంకితమైతే ఇక వ్యక్తిగత జీవితం ఏమైపోతుందనేది ఆ సిద్ధాంతాన్ని విమర్శించే వారి వాదన.
Supreme Court on Freebie Culture: ఉచితాలతో లాభమా?నష్టమా?| Trending స్టోరీ