TO 6 NEWS @ 6PM: తెలంగాణ శాసన మండలికి ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
TO 6 NEWS @ 6PM: తెలంగాణ శాసన మండలికి ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
1) కొత్తగా శాసన మండలిలో అడుగుపెట్టనున్న ఐదుగురు ఎమ్మెల్సీలు
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్ దాఖలు చేసిన ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ నుండి ముగ్గురు, సీపీఐ నుండి ఒకరు, బీఆర్ఎస్ నుండి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వారికి పోటీగా మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసినప్పటికీ వారి పత్రాలు నిబంధనలకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నికల అధికారి వాటిని తిరస్కరించారు. గురువారం సాయంత్రం5 గంటలతో ఆ గడువు ముగిసింది. దీంతో నామినేషన్స్ దాఖలు చేసిన వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ నుండి విజయ శాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. అలాగే సీపీఐ నుండి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ పార్టీ నుండి దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
2) స్పీకర్ పై వ్యాఖ్యలు: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్
Jagadeesh Reddy: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో గందరగోళానికి దారితీశాయి. దీంతో సభను వాయిదా వేశారు. ఈ పరిణామాలను మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ తో భేటీ అయ్యారు.స్పీకర్‌నుద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రులు పరిశీలించారు. మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశమైంది. ఈ సమావేశం ప్రారంభం కాగానే జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అధికార కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత సీతక్క ఈ విషయమై మాట్లాడారు. స్పీకర్ ను టార్గెట్ చేసిన జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్వత్వం రద్దు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Delimitation issue: స్టాలిన్ ఆహ్వానంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
Revanth Reddy about MK Stalin's invitation: డీలిమిటేషన్ వివాదంపై చర్చించేందుకు చెన్నైలో మార్చి 22న జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ జేఏసి సమావేశానికి రావాల్సిందిగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు డిఎంకే నేతల బృందాన్ని పంపించారు. అందులో భాగంగానే డిఎంకే నేతలు కనిమొళి, ఎన్.ఆర్. ఇలాంగో, కె.ఎన్. నెహ్రూలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
డీలిమిటేషన్ పేరుతో కేంద్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతున్నాయని రేవంత్ అన్నారు. ఇది డీలిమిటేషన్ కాదు.... దక్షిణాది రాష్ట్రాలకు పరిమితి విధించడం అవుతుందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణ రాష్ట్రాల నుండే కేంద్రానికి ఆదాయ పన్ను రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
Infosys Narayana Murthy about freebies in India: ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఉచితాలతో పేదరికాన్ని పోగొట్టలేరని అన్నారు. పేదరికం నిర్మూలనకు ఉచితాలు పరిష్కారం కావని సూచించారు. అలా ఉచితాలతో అభివృద్ధి సాధించిన దేశం ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉచితాలు ఇవ్వడానికి బదులు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రోత్సాహకాలు అందించాలని అభిప్రాయపడ్డారు. తాజాగా జరిగిన వ్యవస్థాపకుల సమావేశంలో నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉచితాలను విమర్శిస్తూ ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడాన్ని ఆయన ప్రస్తావించారు. అలా ఉచిత విద్యుత్ లబ్ధి పొందే కుటుంబాల వద్దకు వెళ్లి ర్యాండం సర్వే నిర్వహించాలన్నారు. ఆ కుటుంబాల్లో పిల్లలు బాగా చదువుతున్నారా అని ఆరా తీయాలన్నారు. లేదంటే పిల్లల వికాసం పట్ల ఆ కుటుంబాల్లో ఆసక్తి ఏమైనా పెరిగిందా లేదా అని కనుక్కోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం: స్పేస్ ఎక్స్ 10 మిషన్ ప్రయోగం మళ్లీ ఎప్పుడు?
Sunita Williams: సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది. నాసా ప్రయోగించిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ వాయిదా పడింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరే ముందు టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది. సునీతా విలియమ్స్, విల్ మోర్ ను ఎప్పుడు భూమి మీదకు తీసుకువస్తారోననే చర్చ మళ్లీ తెరమీదికి వచ్చింది.
స్పేస్ ఎక్స్ 10 మిషన్ ఎందుకు వాయిదా పడింది? సునీతా విలియమ్స్, విల్ మోర్ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తీసుకు వచ్చేందుకు స్పేస్ ఎక్స్ మిషన్ 10 ప్రయోగాన్ని మార్చి 12న ప్రారంభించింది. ఈ మిషన్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరడానికి ముందే హైడ్రాలిక్ సిస్టమ్ లో టెక్నికల్ సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Blood Moon: ఈ బ్లడ్ మూన్ ఇండియాలో కనిపిస్తుందా? టైమింగ్స్ ఏంటి?
Blood moon 2025 Interesting Things: మార్చి 14న చంద్ర గ్రహణం పట్టనుంది. ఆకాశంలో దీనిని ఒక అద్భుతంగా ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేంటి... చంద్ర గ్రహణం అంటే ఎప్పుడూ వచ్చేదే కదా అని అనిపిస్తుండొచ్చు. అయితే, ఎప్పుడూ వచ్చే సాధారణ చంద్ర గ్రహణాల కంటే ఈ చంద్ర గ్రహణానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తున్నారు. అంటే చంద్రుడు నెత్తురు రంగులో కనిపించనున్నాడన్న మాట.
ఈ బ్లడ్ మూన్ చంద్ర గ్రహణానికి ఉన్న ఇతర ప్రత్యేకతలు ఏంటి? ఇండియాలో ఉండే వారికి ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుందా? ఏయే ప్రాంతాల వారికి వీక్షించే అవకాశం ఉంటుంది? ఈ చంద్ర గ్రహణాన్ని ఎలా వీక్షించవచ్చు? అసలు ఈ చంద్ర గ్రహనాన్ని బ్లడ్ మూన్ అని ఎందుకు పిలుస్తున్నారు అనే పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.