Ranya Rao's bail plea: హత్య నేరాల్లోనే బెయిల్ ఇస్తున్నారు కదా.. మరి నా క్లయింట్‌కు ఎందుకివ్వరు?
Ranya Rao gold smuggling case: తనను ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదని చెబుతూ తన నిద్ర హక్కుకు భంగం కలిగించారని రన్యా రావు...

Ranya Rao bail plea: హత్య నేరాల్లోనే బెయిల్ ఇస్తున్నారు కదా.. మరి నా క్లయింట్‌కు ఎందుకివ్వరు?
Ranya Rao gold smuggling case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ఆమెకు కాంగ్రెస్ నేతలతో సంబంధం ఉందని బీజేపి నేతలు ఆరోపిస్తోంటే... లేదు ఆమెకు బీజేపి నేతలతోనే సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా ఉండగానే... ఈ కేసు విచారణ చేస్తోన్న అధికారులపై రన్యా రావు పలు ఆరోపణలు చేస్తున్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన సమయంలో అధికారులు విచారణ పేరుతో తనను టార్చర్ పెట్టారని రన్యా రావు ఆరోపించారు. తనను కనీసం ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదని చెబుతూ తన నిద్ర హక్కుకు భంగం కలిగించారని అన్నారు.
రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై బుధవారం బెంగళూరు కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా రన్యా రావు తరపు న్యాయవాది మాట్లాడుతూ బెంగళూరు ఎయిర్ పోర్టులో తన క్లయింట్ ను అరెస్ట్ చేసింది మొదలు అడుగడుగునా ఆమె హక్కులకు భంగం కలిగిస్తూనే ఉన్నారని అన్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదన్నారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం కూడా స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలం కాదని, అధికారుల బలవంతంగా తీసుకున్నారని లాయర్ ఆరోపించారు.
రన్యా రావుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె లాయర్ మరో వాదన కూడా వినిపించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య నేరాల్లో మహిళలు నిందితులుగా ఉన్నట్లయితే, వారికి కోర్టులు బెయిల్ ఇస్తున్నాయని లాయర్ గుర్తుచేశారు. "మరి అలాంటప్పుడు మర్డర్ కేసు కంటే తక్కువ శిక్ష పడే ఈ కేసులో తన క్లయింట్ రన్యా రావుకు ఎందుకు బెయిల్ ఇవ్వరు" అని వాదించారు.