Health Tips: పొత్తికడుపులో నొప్పిగా ఉంటుందా.. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..!

Health Tips: పొత్తికడుపు మధ్యలో నొప్పి రావడానికి గల కారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం

Update: 2022-11-29 03:00 GMT

Health Tips: పొత్తికడుపులో నొప్పిగా ఉంటుందా.. అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..!

Health Tips: కడుపు నొప్పి అనేది సాధారణ సమస్య. అయితే ఈ సమస్య పదే పదే వేధిస్తున్నప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కచ్చితంగా కడుపు నొప్పికి చికిత్స చేయడం అవసరం. పొత్తికడుపు నొప్పి ఏ వయస్సులో వారికైనా వస్తుంది. అయితే కొందరికి పొత్తికడుపు మధ్యలో ఎప్పుడు నొప్పిగా ఉంటుంది. పొరపాటున కూడా దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. పొత్తికడుపు మధ్యలో నొప్పి రావడానికి గల కారణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అజీర్ణం సమస్య

కడుపు మధ్యలో నొప్పికి కారణం అజీర్ణం అయి ఉంటుంది. దీనివల్ల కడుపు ఎగువ భాగంలో చాలా అసౌకర్యం ఉంటుంది. కడుపు ఎప్పుడు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కడుపునొప్పి వస్తే నిర్లక్ష్యం చేయవద్దు.

గాల్ బ్లాడర్ స్టోన్స్

పిత్తాశయంలో రాళ్లు ఉంటే పొత్తి కడుపు మధ్యలో నొప్పి వస్తుంది. ఎందుకంటే పిత్తాశయంలో రాయి ఉన్నప్పుడు కడుపులో చాలా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కడుపు ఎగువ భాగంలో చాలా నొప్పి ఉంటుంది. కడుపులో నొప్పి ఉంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారికి పొత్తికడుపు మధ్యలో నొప్పి ఉంటుంది. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల కడుపులో నొప్పి రావడమే కాదు జ్వరం కూడా వస్తుంది.

ప్యాంక్రియాస్‌లో సమస్య

ప్యాంక్రియాస్ మన కడుపులో ఉండే ఒక అవయవం. ఇది గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఎలాంటి సమస్య వచ్చినా కడుపులో నొప్పి వస్తుంది. దీని వల్ల కడుపు మధ్య భాగంలో నొప్పిగా ఉంటుంది. కాబట్టి కడుపు నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

Tags:    

Similar News