'ఎవరైనా ఫ్రంట్ పెట్టుకుని.. టెంట్లు వేసుకోవొచ్చు'
తాజాగా జరిగిన బీజేపీ జాతీయ సమావేశాలు ఘనంగా జరిగాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు.
తాజాగా జరిగిన బీజేపీ జాతీయ సమావేశాలు ఘనంగా జరిగాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మోడీ నినాదంతో ఎన్నికల రణరంగంలో దిగాలని జాతీయ సమావేశం నిర్వహించిందని లక్ష్మణ్ పెర్కోన్నారు. ఎవరైనా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్లు వేసుకోవచ్చని, దాని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదన్నారు. ఫ్రంట్లు టెంట్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఇద్దరు చంద్రులు ఫ్రంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇద్దరి ప్రయత్నాలు విఫలం కావడం తథ్యమన్నారు డా. లక్ష్మణ్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తప్పకుండా నరేంద్రమోడీకే పట్టం కట్టాలని చూస్తున్నారని అన్నారు. అసలు జాతీయ పార్టీలేని కూటములు ఎన్ని జతకట్టిన కాని వృదానే అని అన్నారు. ఎదేమైనా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా రేపరేపలాడుతుందని లక్ష్మణ్ ధీమావ్యక్తం చేశారు.