Moto G05: రూ. 7 వేలకే 50MP కెమెరా.. మోటోరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌

Motorola launches Moto G05 phone: మోటోరోలా భారత మార్కెట్లోకి తాజాగా మోటో G05 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌, 64 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999గా నిర్ణయించారు.

Update: 2025-01-09 16:05 GMT

Moto G05 Phone price and features: కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో G05 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి తాజాగా మోటో G05 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌, 64 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999గా నిర్ణయించారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హెలియో G68 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 18 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5200 mah బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రీయర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఇక ఈ ఫోన్‌లో 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. ర్యామ్‌ను వర్చువల్‌లో 12GB వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6.67 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇందులో అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యుయల్ 4G ఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, FM రేడియో, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, గ్లోనాస్ గెలీలియో, వై-ఫై, 3.5MM ఆడియో జాక్స్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.

సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను ఇచ్చారు. మోటో G05 స్మార్ట్ ఫోన్‌ను ఫారెస్ట్‌ గ్రీన్‌, ఫ్లమ్‌ రెడ్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఇక లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై పలు రకాల డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.

Tags:    

Similar News