IRCTC: రూ.50వేలతో థాయిలాండ్ చుట్టేయోచ్చు..IRCTC బంపర్ ప్యాకేజీ ఫూర్తి వివరాలివే

IRCTC: మీకు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ ఉన్నప్పటికీ బడ్జెట్ కారణంగా వెళ్లలేకపోతున్నారా?అయితే మీలాంటి వారి కోసం IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ బడ్జెట్ లో విదేశాలకు వెళ్లే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కేవలం రూ. 50,000లో థాయ్ లాండ్ ను చుట్టేయ్యేచ్చు. వసతి, ఆహారం అన్నీ కూడా ఈ బడ్జెట్లో నే చేర్చారు. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2024-07-04 04:20 GMT

IRCTC: రూ.50వేలతో థాయిలాండ్ చుట్టేయోచ్చు..IRCTC బంపర్ ప్యాకేజీ ఫూర్తి వివరాలివే

IRCTC:థాయిలాండ్ విహార యాత్రకు ఐఆర్ సీటీసీ ఓ సదావకాశాన్ని భారతీయ యాత్రికుల కల్పిస్తోంది. స్నేహితులతో లేదా భాగస్వామితో కలిసి జులై నెల థాయిలాండ్ లో విహారయాత్ర చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.IRCTC థ్రిల్లింగ్ ప్యాకేజీ మీ విహారయాత్రలో మరింత ఉత్సాహం నింపుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. జులైలో ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ కేవలం రూ.50,000లో విదేశాలకు వెళ్లాలనే మీ కలను నెరవేర్చుకోండి.

ప్యాకేజీ పేరు- ట్రెజర్స్ ఆఫ్ థాయిలాండ్ ఎక్స్ హైదరాబాద్

ప్యాకేజీ వ్యవధి- 3 రాత్రులు, 4 రోజులు

ప్రయాణ విధానం- ఫ్లైట్

ఏయే నగరాలు చూడవచ్చు- బ్యాంకాక్, పట్టాయా

మీరు ఎక్కడ సందర్శించవచ్చు - హైదరాబాద్

ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి:

1. మీరు రౌండ్ ట్రిప్ ఫ్లైట్ కోసం ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తారు

2 . బస చేసేందుకు హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

3 . ఈ టూర్ ప్యాకేజీలో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది.

4 . ప్రయాణ బీమా సౌకర్యం కూడా ఉంటుంది .

ప్రయాణానికి ఇంత మొత్తం వసూలు చేస్తారు:

1. ఈ ట్రిప్‌లో మీరు ఒంటరిగా ప్రయాణించినట్లయితే , మీరు రూ. 57,820 చెల్లించాలి.

2 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.49,450 చెల్లించాల్సి ఉంటుంది.

3 . ఒక్కొక్కరికి రూ.49,450 చొప్పున ముగ్గురు వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది.

4 . మీరు పిల్లలకు ప్రత్యేక ఫీజు చెల్లించాలి. బెడ్‌తో (5-11 ఏళ్లు) రూ.47,440, బెడ్ లేకుంటే రూ.42,420 చెల్లించాలి.

IRCTC ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ఒక ట్వీట్‌ను షేర్ చేసింది. ఇందులో మీరు థాయిలాండ్ అందమైన దృశ్యాలను చూడాలనుకుంటే, మీరు IRCTC ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు.



మీరు ఇలా బుక్ చేసుకోవచ్చు:

మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి కూడా బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు. 

Tags:    

Similar News