Iran Hit List: ఇరాన్ హిట్ లిస్ట్ వైరల్.. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే

Update: 2024-10-03 11:58 GMT

Iran Hit List: ఇరాన్ మట్టుపెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్న ఇజ్రాయెల్ నేతల పేర్లతో కూడిన ఒక హిట్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్ టెర్రరిస్టుల ఎగ్జిక్యూషన్ లిస్ట్ పేరుతో వైరల్ అవుతున్న ఈ జాబితాలో చాలా పేర్లే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ కూడా ఆ హిట్ లిస్ట్ జాబితాలో ఇజ్రాయెల్ టెర్రరిస్టులుగా ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఇజ్రాయెల్‌కి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ పేర్లు ఉన్నాయి.

ఇజ్రాయెల్ మిలిటరీలో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న జనరల్ స్టాఫ్ చీఫ్ హర్జి హలేవి, డిప్యూటీ చీఫ్ ఆమీర్ బరాం, ఉత్తర కమాండ్ మేజర్ జనరల్ ఓరి గోర్డిన్, సదరన్ కమాండ్ మేజర్ జనరల్ యెహుదా ఫాక్స్, సెంట్రల్ కమాండ్ జనరల్ మేజర్ ఎలిజర్ కూడా ఇరాన్ హిట్ లిస్టులో ఉన్నారు.


హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ కూడా హెజ్బొల్లాకు చెందిన 11 మంది కమాండర్స్‌ని మట్టుపెట్టినట్లుగా వారి ఫోటోలతో కూడిన పోస్టర్‌ని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విడుదల చేశాయి. ఇజ్రాయెల్ బలగాలు ఎలాగైతే హెజ్బొల్లాకు చెందిన కమాండర్స్‌ని హతమార్చి వారి జాబితాను విడుదల చేశాయో.. తాము కూడా ఇజ్రాయెల్ మిలిటరీలో కీలకమైన కమాండర్స్‌ని మట్టుపెడతాం అని సంకేతాలు ఇచ్చేందుకే ఇరాన్ ఈ పోస్టర్‌ని సోషల్ మీడియాలోకి వదిలిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పాలస్తినాకు చెందిన రివేంజ్ ఈజ్ నియర్ అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం ఇరాన్ vs ఇజ్రాయెల్ అంతర్జాతీయ వార్తా కథనాల్లో కనిపిస్తోంది. అయితే, ఈ పోస్టర్‌పై ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఇరాన్ అభిమతం కూడా అలాంటిదేనని ఆ వార్తా కథనాలు చెబుతున్నాయి.తంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లంట్ పాలస్తినా ప్రజలను జంతువులతో పోల్చారనే అభియోగాలున్నాయి. అన్నింటికిమించి ఇజ్రాయెల్ బలగాలను వెనుకుండి నడిపిస్తున్న వ్యక్తి కూడా యోవ్ కావడంతో ఆయన పేరు ఇరాన్ హిట్ లిస్టులో ఉండటంపై ఎలాంటి ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News