Israel - Iran War: ఇజ్రాయిల్ - ఇరాన్ యుద్ధంలో అదే జరిగితే, భారత్, చైనాలకు ఈ పెద్ద ఇబ్బంది తప్పదు.. ఏంటో తెలుసుకోండి..?
Israel - Iran War: పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో ప్రస్తుతం యుద్ద వాతావరణ నెలకొని ఉంది. ఇటీవల ఇజ్రాయిల్ పై ఇరాన్ ఏకంగా 200 బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇరాన్ పై ప్రతికార దాడులకు సిద్ధమవుతోంది. అయితే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ప్రారంభించాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ చమురు ధర అంతర్జాతీయంగా 77 డాలర్లు పైచిలుకు ట్రేడ్ అవుతోంది. గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు సరఫరా ఆటంకం ఏర్పడితే ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు సైతం తాకే అవకాశం ఉంటుందని ముందుగానే సూచిస్తున్నారు.
నిజానికి ఇరాన్ భారత్, చైనా లకు అతిపెద్ద చమురు ఎగుమతి దారుగా ఉంది. ఇరాన్ లోని చాబహార్ పోర్టు భారత్ కు అత్యంత కీలకమైనది. ఆ ఓడరేవు నిర్మాణంలో భారత్ పాత్ర కూడా ఉంది. భారత్ చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారులు. క్రూడ్ ఆయిల్ దిగుమతి విషయంలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇరాన్ పైన ఇజ్రాయిల్ కనుక దాడులకు దిగితే, అక్కడి చమురు క్షేత్రాలే లక్ష్యంగా దిగుతుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగినట్లయితే ప్రపంచ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 5శాతం మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఇరాన్ సమీపంలోనే ఉన్న సౌదీ అరేబియా, ఖతార్, యమన్, ఇరాక్ వంటి దేశాలు కూడా ఈ యుద్ధం కారణంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చమురు తీసుకెళ్లే నౌకలకు యుద్ధం కారణంగా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయలు ఎగువన ఉన్నాయి. అయితే యుద్ధం ప్రభావం కేవలం పెట్రోల్ డీజిల్ పైనే కాదు క్రూడ్ సంబంధిత ఉత్పత్తులను పడుతుంది. ముఖ్యంగా పలు రకాల కెమికల్స్ ఫెర్టిలైజర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.