Spy Training: గూఢచారులు కావాలెను.. అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సీఐఏ వినూత్నమైన ప్రకటన..అర్హతలు ఇవే
Spy Training: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీలో సిఐఏ పేరు అందరికీ తెలిసిందే అమెరికన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీగా పిలవబడే సీఐఏ పేరు మనందరం హాలీవుడ్ సినిమాల్లో వినే ఉంటాం. సిఐఏ ఏజెంట్లు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పనులను చేస్తూ ఉంటారు. ఇతర దేశాల్లో గూఢచారులుగా పని చేస్తూ ఉగ్రవాదులు, అలాగే అమెరికాకి పొంచి ఉన్న అనేక ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ ఉంటారు.
Spy Training: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీ సిఐఏ పేరు అందరికీ తెలిసిందే. అమెరికన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీగా పిలవబడే సీఐఏ పేరు మనందరం హాలీవుడ్ సినిమాల్లో వినే ఉంటాం. సిఐఏ ఏజెంట్లు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పనులను చేస్తూ ఉంటారు. ఇతర దేశాల్లో గూఢచారులుగా పని చేస్తూ ఉగ్రవాదులు, అలాగే అమెరికాకి పొంచి ఉన్న అనేక ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ ఉంటారు.
అయితే తాజాగా సిఐఏ తమకు గూడచారులు కావాలని లింకిడిన్ వెబ్ సైట్ లో ఒక ప్రకటన ఇచ్చింది. దీంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. మరీ ఇంత బహిరంగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీలో పనిచేయడానికి ప్రకటన ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సిఐఏ ఏజెంట్ల నియామకం చాలా గోప్యంగా జరుగుతుంది.
అయితే ఈసారి అమెరికా వినూత్నమైన పద్ధతుల ముందుకు వెళుతుంది. ముఖ్యంగా తమకు పని చేయడానికి ఇరాన్, చైనా, ఉత్తర కొరియాల్లో ఏజెంట్ల అవసరం ఉందని పేర్కొంది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా చాలామంది తాము పని చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే కానీ గూడచారిగా పని చేయాలంటే చాలా కష్టతరమైన జాబ్ శత్రు దేశాల్లో ఆ దేశ రక్షణ వ్యవస్థను కన్ను గప్పి కీలకమైన సమాచారాన్ని అమెరికాకు చేరవేస్తూ ఉండాలి.
ఇది ఎంతో రిస్క్ తో కూడిన జాబ్. తేడా వస్తే మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి ఇంత రిస్క్ ఉన్న జాబ్ కోసం ఎవరు ట్రై చేస్తారా అనే ఆలోచన రావచ్చు. అమెరికా తమ సీక్రెట్ ఏజెన్సీ సిఐఏ లో పనిచేసే వారికి పెద్ద మొత్తంలో పారితోషికం అందజేస్తుంది. అంతేకాదు అమెరికన్ సిటిజన్ గా కూడా గుర్తిస్తుంది. ఇలా అనేక సదుపాయాలు కల్పిస్తుంది. వృత్తిరీత్యా చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది.
అయినప్పటికీ ప్రతిఫలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ జాబ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం జేమ్స్ బాండ్ల మీరు కూడా పని చేయాలంటే సిఐఏ ప్రకటన ద్వారా అప్లై చేసుకోవచ్చు.