Israel Hezbollah War: హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్

Israel Hezbollah War: హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ షురూ చేసింది. హిజ్బుల్లా మౌలిక వసతులను నాశనం చేయడంతోపాటు లెబనాన్ లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది.

Update: 2024-10-01 01:10 GMT

Israel Hezbollah War: హిజ్బుల్లాను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్

Israel Hezbollah War: హిజ్బుల్లాను టార్గెట్ చేసి వరుసదాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్..లెబనాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం అందించింది. హిజ్బుల్లా మౌలిక వసతులను టార్గెట్ చేసుకుని లెబనాన్ సరిహద్దుల వద్ద పరిమితంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

గతకొన్నాళ్లుగా లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తోన్ విషయం తెలిసిందే. ఆదివారం బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా , మరో కీలక నేత నబిల్ కౌక్ ను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్ సైన్యం మొదట సరిహద్దుల్లో వైమానిక దాడులు నిర్వహించి భూతల దాడులకు మార్గాన్ని మరింత సుగుమం చేసుకుంది.

అయితే 2006లో ఇలాంటి ప్రయత్నం ఇజ్రాయెల్ కు ఇబ్బందికరంగా మారింద. మళ్లీ అలాంటి ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ఉన్న స్థావరాలపై మాత్రమే దాడులను నిర్వహిస్తోంది. వైమానిక దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

చొరబాటు భయాల కారణంగా లెబనీస్ సైన్యం తన దక్షిణ సరిహద్దు నుండి తన దళాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. లెబనీస్ సైనిక అధికారి సోమవారం AFP వార్తా సంస్థతో చెప్పారు. లెబనీస్ సైన్యం దక్షిణ సరిహద్దు నుండి తన బలగాలను మళ్లీ మోహరిస్తోంది. హిజ్బుల్లా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, 2006 యుద్ధం మాదిరిగానే ఇజ్రాయెల్ మరోసారి ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

ఎందరో నేతలను కోల్పోయినా మన నైతిక స్థైర్యం తగ్గలేదని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీం ఖాసీం అన్నారు. మా రాకెట్, క్షిపణి దాడులు ఇజ్రాయెల్‌కు 150 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్నాయి. మేము నేల పోరాటంలో కూడా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము అని తెలపారు.

Tags:    

Similar News