US VISA: మరో 2,50,000 అమెరికా వీసా అపాయింట్‌మెంట్స్‌కు అనుమతి
US visa Appointments for Indian: భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జో బిడెన్ వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి, వేగవంతం చేయడానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
US visa Appointments for Indian: పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులతో సహా భారతీయ ప్రయాణికుల కోసం అదనంగా 250,000 వీసా అపాయింట్‌మెంట్‌లను (visa appointments) ప్రారంభించినట్లు US ఎంబసీ తెలిపింది. గత ఏడాది జారీ చేసిన 1.4 లక్షలకు పైగా విద్యార్థి వీసాల కంటే ఈ ఏడాది అమెరికా (America) మరోసారి రికార్డు స్థాయిలో విద్యార్ధి వీసాలను జారీ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికం. ఇప్పుడు అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు.
వేల మంది భారతీయ దరఖాస్తుదారులకు సకాలంలో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇది సహాయపడతాయని యుఎస్ ఎంబసీ అధికారులు చెప్పారు. భారతదేశానికి US మిషన్ ఇప్పటికే వరుసగా రెండవ సంవత్సరం 10 లక్షల వలసేతర వీసా దరఖాస్తులను అధిగమించింది. ఈ ఏడాది అంటే 2024 వేసవిలో మా స్టూడెంట్ వీసా సీజన్‌లో మేము రికార్డ్ నంబర్‌లను ప్రాసెస్ చేసాము. మొదటి సారి విద్యార్థి దరఖాస్తుదారులందరూ భారతదేశంలోని మా ఐదు కాన్సులర్ సెక్షన్‌లలో ఒకదానిలో అపాయింట్‌మెంట్ పొందగలిగామని తెలిపారు.
భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జో బిడెన్ వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి, వేగవంతం చేయడానికి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. మేము ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎంబసీలోని మా కాన్సులర్ బృందాలు, నాలుగు కాన్సులేట్‌లు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయన్నారు.
2023లో US 1.4 లక్షలకు పైగా విద్యార్థి వీసాలను జారీ చేసింది. వ్యక్తిగతంగా తీసుకుంటే, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఇప్పుడు ప్రపంచంలోని మొదటి నాలుగు విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పోస్ట్‌లుగా నిలిచాయి. ఈ పెరుగుతున్న సంఖ్యల ఫలితంగా భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్‌లో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో అతిపెద్ద సమూహంగా మారారు. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థులలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఉన్నారు.