Biden: ఇజ్రాయెల్,అమెరికాతోపాటు ప్రపంచానికి మంచిరోజూ.. యాహ్యా సిన్వార్ మరణంపై స్పందించిన బైడెన్

Yahya Sinwar Eliminated: ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను హతమార్చింది. యాహ్యా సిన్వార్ మృతిపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ స్పందించారు. సిన్వార్‌ మరణం ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచానికి శుభదినమని జో బైడెన్ అన్నారు.

Update: 2024-10-18 03:12 GMT

Biden: ఇజ్రాయెల్,అమెరికాతోపాటు ప్రపంచానికి మంచిరోజూ.. యాహ్యా సిన్వార్ మరణంపై స్పందించిన బైడెన్

Yahya Sinwar Eliminated: ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను చంపింది. జులైలో హమాస్ రాజకీయ అధిపతి ఇస్మాయిల్ హనియా హత్య తర్వాత సిన్వార్ హమాస్‌కు కొత్త నాయకుడయ్యాడు. సిన్వార్ మరణానంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ సైనికుల దాడిలో హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ మరణించడం ఇజ్రాయెల్, అమెరికాతోపాటు ప్రపంచానికి మంచి రోజు అన్నారు. సిన్వార్ మరణం ఇజ్రాయెల్ బందీలను విడిపించేందుకు.. గాజాలో ఏడాదిపాటు సాగిన యుద్ధాన్ని ముగించడానికి హమాస్‌కు ఒక అవకాశం అని బైడెన్అన్నారు.

ఉగ్రవాదులు న్యాయం తప్పించుకోలేరు:

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడ్డ సూత్రధారి మరణం ప్రపంచంలో ఎక్కడా ఉన్న ఏ ఉగ్రవాది ఎంత సమయం పట్టినా న్యాయం తప్పించుకోలేడని మరోసారి రుజువు చేస్తోందని జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇతర ఇజ్రాయెల్ నాయకులతో మాట్లాడుతానని.. అభినందిస్తానని బైడెన్చె ప్పారు. బందీలను వారి కుటుంబాలకు తిరిగి ఇవ్వడానికి..ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే మార్గాలను చర్చిస్తామని బైడెన్ చెప్పారు. అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైన తర్వాత అమెరికాలో నెలకొన్న సెంటిమెంట్‌తో ఈ ఘటనను బైడెన్ పోల్చారు.


అదే సమయంలో, అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కూడా సిన్వార్ మరణాన్ని గాజాలో యుద్ధాన్ని ముగించడానికి ఒక అవకాశంగా అభివర్ణించారు. విస్కాన్సిన్ కళాశాల క్యాంపస్‌లో ప్రచారం చేస్తూ, కమలా హారిస్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్. దాని పౌరులు సురక్షితంగా ఉండే విధంగా యుద్ధం ముగియాలని, బందీలను విడుదల చేయాలని, గాజాలో బాధలు ముగుస్తాయి.. పాలస్తీనియన్లు వారి గౌరవాన్ని, భద్రతను, స్వేచ్ఛను అనుభవిస్తారు హక్కులను అనుభవిస్తారు. "ఇప్పుడు కొత్త రోజు ప్రారంభించాల్సిన సమయం వచ్చింది," అని ఆమె వెల్లడించారు. 

Tags:    

Similar News