ఇజ్రాయెల్ యుద్ధంపై రేపు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు
ICJ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ‘అంతర్జాతీయ న్యాయస్థానం’ శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
ICJ: ది హేగ్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ‘అంతర్జాతీయ న్యాయస్థానం’ శుక్రవారం తీర్పు వెలువరించనుంది. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక చర్య భారీగా ప్రాణ నష్టానికి దారి తీస్తోందని, దానిని ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని దక్షిణాఫ్రికా కోరింది. ఈ కేసును కొట్టివేయాలని ఇజ్రాయెల్ కోరుతోంది. ఈ నెల 26న తీర్పు ఇస్తామని న్యాయస్థానం బుధవారం తెలిపింది. గతంలో అంతర్జాతీయ ట్రైబ్యునళ్లు, ఐరాస దర్యాప్తు సంస్థల్ని ఇజ్రాయెల్ బహిష్కరించింది. తాజా కేసులో దక్షిణాఫ్రికా అభ్యర్థనల్లో అన్నింటికి, లేదా కొన్నింటికి ఐరాస ఉన్నత న్యాయస్థానం అంగీకరిస్తే వాటినైనా ఇజ్రాయెల్ పాటిస్తుందా అనేది తేలాలి.