WHO: వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటూ..

* వేద ఫిల్లింగ్ స్టేషన్‌ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ప్రారంభించారు

Update: 2022-12-14 15:30 GMT
WHO Warns About New Variants

WHO: వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటూ..

  • whatsapp icon

World Health Organization: వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి జాగ్రత్త..నిర్లక్ష్యం చేస్తే వైరస్ మీ అంతు చూడడం ఖాయం..ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకపోయినా..వైరస్ మీపై ముప్పేట దాడిచేసి ముప్పు తిప్పలు పెట్టడం ఖాయం..ఏమౌతుంది లే అనుకుంటే..అసలుకే ఎసరొస్తుంది తస్మాత్ జాగ్రత్త..ఈ మాటలు..హెచ్చరికలు చేస్తోంది మరెవరో కాదు..సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ. అసలే ఇది చలి కాలం..కొత్త కొత్త వైరస్‌లు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ హెచ్చరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి..జాగ్రత్త సుమీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను హెచ్చరిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో కరోనాతోపాటు ఇతర రకాల వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్‌ల వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. లేదంటే కరోనా ఫస్ట్‌వేవ్ నాటి పరిస్థితులు మళ్లీ రిపీట్ కావడం ఖాయమని చెప్తోంది. అసలు ఇది వింటర్ సీజన్..అంటు వ్యాధులు, వైరస్, బ్యాక్టీరీలు అంత్యంత వేగంగా వ్యాప్తి చెందడానికి అనువైన కాలం..ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన ప్రపంచ దేశాలు..ఇప్పుడిప్పుడే దాని ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాయి. ఇదే సమయంలో వైరస్‌ల వ్యాప్తి కట్టడిపై ప్రపంచంలోని పలు దేశాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కొవిడ్-19, ఫ్లూతోపాటు ఇతర వ్యాధి కారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని..ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని WHO సూచిస్తోంది. కొవిడ్‌-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్​లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వింటర్ సీజన్ కావడంతో..ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని ఇలాంటి సమయంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్‌లు తీసుకోని వారు వెంటనే వ్యాక్సినేషన్ చేయించుకోవాలని..ఇంట్లో ఉండే కుటుంబసభ్యులందరూ అన్ని రకాల ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వివరిస్తోంది. వ్యాక్సిన్‌లు తీసుకోవడమే కాదు.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్‌, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారిన పడితే ఇంటి దగ్గరే ఉండటం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముప్పును ముందే తెలుసుకోవడం ద్వారా వాటి తీవ్రతను తగ్గించవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్‌-19 సాంకేతిక విభాగాధిపతులు స్పష్టం చేశారు.

ఇక కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై స్పందించిన WHO..ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 500లకు పైగా ఒమిక్రాన్‌ ఉప రకాలు వ్యాప్తిలో ఉన్నాయని తెలిపింది. ఈ వేరియంట్ల వ్యాప్తి, రోగనిరోధకత నుంచి అవి ఏ విధంగా తప్పించుకుంటున్నాయి..వాటి తీవ్రత వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. అమెరికాలో ఇటీవల పెరుగుతోన్న శ్వాసకోశ సంబంధ కేసులను WHO నిపుణులు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సీజన్‌లో 1.3కోట్ల శ్వాసకోశ సంబంధ కేసులు నమోదు కాగా లక్షా 20వేల మంది ఆస్పత్రిలో చేరారు. 7300 ఫ్లూ మరణాలు సంభవించినట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. దీంతో న్యూయార్క్‌, కాలిఫోర్నియా, మైనీ, లుసియానా రాష్ట్రాల్లో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు.. ప్రజలను ఫ్లూ, కొవిడ్‌ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

నిన్నా మొన్నటి వరకు కరోనా పస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎలా ప్రభావం చూపిందో ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. థర్డ్ వేవ్ కూడా అలాగే ఉంటుందని అంచనా వేసినా...అలాంటి పరిస్థితి తలెత్తలేదు. థర్డ్‌ వేవ్‌లో కరోనా వ్యాప్తి, మరణాల సంఖ్య స్పల్పంగానే ఉంది. కరోనా కంట్రోల్లోకి వచ్చిందని ప్రజలందరూ భావిస్తున్న ఇలాంటి సమయంలో WHO చేసిన తాజా హెచ్చరికలు కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని చెప్పకనే చెప్తున్నాయి. ఏ క్షణంలో ఎటునుంచి కొత్త వైరస్‌లు దాడి చేస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రకరకాల కరోనా వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తుండడంతో..ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అన్న భయం ప్రపంచ దేశాలను వెంటాడుతున్నాయి. అనునిత్యం ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడమే శ్రీరామ రక్ష అంటున్నారు నిపుణులు. వైరస్‌, బ్యాక్టీరియాలు మన శరీరంపై దాడి చేయకుండా..ఒకవేళ చేసినా తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని WHO సూచిస్తోంది. 

Tags:    

Similar News