Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald ట్రంప్)ను హుష్ మనీ కేసులో (Porn star case) అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ఈ నేరానికి గాను అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జరిమానా చెల్లించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అతని రికార్డులో మాత్రం అపరాధం చేసినట్లుగా రుజువైంది. న్యూయార్క్ జడ్జి జువాన్ మెర్చాన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్(Porn star Stormy Daniels)కు డబ్బు ఇచ్చినందుకు ట్రంప్ దోషిగా తేలాడు.
ట్రంప్ పై నిరూపితమైన నేరానికి అతనికి గరిష్టంగా 4ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. కానీ ట్రంప్ ను ఈ కేసులో దోషిగా తేల్చిన మన్ హటన్ జడ్జి జువాన్ ఎం మెర్చన్ ట్రంప్ నకు ఎలాంటి శిక్ష విధించకూడదంటూ తీర్పునిచ్చారు. తర్వాత తదుపరి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంలో ట్రంప్ కు చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దేశంలో ఎలాంటి రాజ్యాంగ సమస్య ఎదురవ్వకుండా న్యాయమూర్తి జాగ్రత్త పడ్డారు.
ఈ తీర్పుతో నేరం రుజువైన తొలి అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ క్రియేట్ చేశారు. శిక్ష విధించే ముందు ఏవైనా తీవ్రమైన అంశాలను పరిగణలోనికి తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏదేమైనా అధ్యక్షుడిగా ట్రంప్ అనుభవించే చట్టపరమైన రక్షణ అన్నింటిని అధిగమించే అంశం అని అన్నారు. జ్యూరీ తీర్పును చెరిపేసే అధికారం అధ్యక్షుడికి న్యాయపరమైన రక్షణలకు లేదని న్యాయమూర్తి అన్నారు. అయితే ట్రంప్ రికార్డులో ఈ నేరం ఉంటుందని అన్నారు.
ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలి, అధికారికంగా శిక్ష పడిన అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ట్రంప్. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు తన సహచరులలో ఒకరి ద్వారా US$130,000 చెల్లించినందుకు ట్రంప్‌కు సంబంధించిన కేసు, తద్వారా ఆమె అతనితో లైంగిక సంబంధం గురించి బహిరంగంగా చెప్పలేదు.
పోర్న్‌స్టార్‌కు డబ్బులిచ్చి నోరు అదుపులో పెట్టుకోకుండా ఉండేందుకు ఈ కేసులో శిక్షపై స్టే విధించాలని మాజీ రాష్ట్రపతి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే, సుప్రీంకోర్టు ట్రంప్ పిటిషన్‌ను తిరస్కరించింది. జస్టిస్ మెర్చన్ అతని శిక్షను శుక్రవారం ప్రకటించడానికి మార్గం సుగమం చేసింది.