Hush Money Case: సుప్రీంకోర్టులో ట్రంప్ నకు ఎదురుదెబ్బ

Hush Money Case: పోర్న్ స్టార్ కు హష్ మనీ కేసులో డోనాల్డ్ ట్రంప్ నకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2025-01-10 07:45 GMT

Hush Money Case: సుప్రీంకోర్టులో ట్రంప్ నకు ఎదురుదెబ్బ

Hush Money Case: పోర్న్ స్టార్ కు హష్ మనీ కేసులో డోనాల్డ్ ట్రంప్ నకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనకు శిక్ష విధిస్తానని న్యూయార్క్ న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాలను అడ్డుకోవాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్ధనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. శుక్రవారం ట్రంప్ నకు న్యూయార్క్ కోర్టు జడ్జి జువాన్ ఎం. మెర్చన్ శిక్షను విధిస్తారు. 2024 నవంబర్ లో ట్రంప్ నకు న్యూయార్క్ కోర్టు హష్ మనీ కేసులో శిక్షణు ఖరారు చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. దీంతో ఈ కేసులో తీర్పును వాయిదా వేయాలని ట్రంప్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నవారికి క్రిమినల్ విచారణ నుంచి రక్షణ ఉంటుందని ఆయన తన పిటిషన్ లో కోరారు. అయితే ఇలాంటి కేసుల్లో అధ్యక్షుడికి ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు ట్రంప్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. 2025 జనవరి 10న ట్రంప్ నకు శిక్ష విధిస్తామని న్యూయార్క్ జడ్జి తెలిపారు. అయితే శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా డిశ్చార్జిని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

హష్ మనీ కేసు ఏంటి?

డోనల్డ్ ట్రంప్ 2016 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ తో తాను ఏకాంతంగా గడిపిన విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమెకు 1.30 లక్షల డాలర్లు హష్ మనీని తన లాయర్ ద్వారా ఇప్పించారనేది ఆరోపణ. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన విరాళాల నుంచి ఈ హష్ మనీని వాడుకున్నారని .. దీని కోసం రికార్డులను తారుమారు చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 34 అంశాలపై ట్రంప్ పై నేరాలు నమోదయ్యాయి. స్టార్మీ డానియల్స్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. ట్రంప్ తో తాను ఏకాంతంగా గడిపిన విషయాన్ని ఆమె కోర్టులో చెప్పారు. సాక్షాలతో పాటు ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత ఈ అభియోగాలపై 12 మంది జడ్జిల ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఆయనను దోషిగా కోర్టు నిర్ధారించింది. అయితే ఈ కేసులో ఆయనకు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది.

Tags:    

Similar News