WHO: ఒమిక్రాన్‌తో ప్రమాదం చాలా ఎక్కువే.. 60 దేశాలకు వ్యాపించిన వైరస్

*డెల్టా కంటే యమ డేంజర్ *ఒమిక్రాన్ భౌగోళిక ముప్పుగా మారిందన్న WHO *మరణాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం

Update: 2021-12-14 03:19 GMT

ఒమిక్రాన్‌తో ప్రమాదం చాలా ఎక్కువే

Omicron: ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతుంది. వైరస్ వేగంగా విస్తరిస్తూ ఇప్పటికే 60 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ తో ప్రమాదం ఎక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. డెల్టా కంటే యమ డేంజర్ అని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భౌగోళిక ముప్పుగా పరిణమించిందని WHO చెబుతోంది.

అనేక కారణాలతో ఒమిక్రాన్‌తో ప్రమాదం ఎక్కువగానే ఉంది.ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రోగ నిరోధక శక్తిని ఏమార్చుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది తీవ్ర పరిణామాలతో మరో విజృంభణకు దారితీయొచ్చొని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దక్షిణాఫ్రికాలో రీఇన్ఫెక్షన్ పెరుగుతున్నట్లు వెలువడిన సంకేతాలను ప్రస్తావించింది.

ఈ కొత్త వేరియంట్‌ తో వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో ఒక అంచనాకు వచ్చేందుకు మరింత సమాచారం కావాల్సి ఉందంటోంది. వైరస్ వేగంగా ప్రబలితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని, మరిన్ని మరణాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తోంది.

Tags:    

Similar News