సునీతా విలియమ్స్‌ను భూమి మీదకు ఎప్పుడు తీసుకువస్తారో తెలుసా?

సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ను అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకువచ్చే క్రూ 10 మిషన్ ను మార్చి 14న ప్రారంభించనున్నారు.

Update: 2025-03-14 06:58 GMT
When Sunita Williams Will be Brought Back to Earth

సునీతా విలియమ్స్‌ను భూమి మీదకు ఎప్పుడు తీసుకువస్తారో తెలుసా?

  • whatsapp icon

సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ను అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకువచ్చే క్రూ 10 మిషన్ ను మార్చి 14న ప్రారంభించనున్నారు. రెండు రోజుల క్రితం సునీతా విలియమ్స్ ను అంతరిక్షం నుంచి తీసుకువచ్చేందుకు క్రూ-10 మిషన్ చివరి నిమిషంలో రద్దైంది.

మార్చి 12న అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరే ముందు టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ వాయిదా పడింది. క్రూ 10 మిషన్ అమెరికా కాలమానప్రకారం మార్చి 13 రాత్రి ఏడుగంటలకు ప్రారంభం కానుంది. అదే భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం నాలుగున్నర గంటలకు ఈ మిషన్ ప్రారంభం కానుంది.

బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ 2024 జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. విమానాల్లో ఇతర దేశాలకు వెళ్లినట్టే అంతరిక్షానికి వ్యోమనౌకలో వెళ్లే ప్రయోగంలో భాగంగా ఈ ఇద్దరు వ్యోమగాములు ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో ఉండి తిరిగి భూమి మీదకు రావాలనేది షెడ్యూల్. స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు రావడంతో ఈ ఇద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. వీరిని అంతరిక్షానికి తీసుకెళ్లిన స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ లో భూమి మీదకు తిరిగి వచ్చింది.

క్రూ-10 మిషన్ సక్సెస్ అయితే సునీతా విలియమ్స్, విల్ మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి 2025 మార్చి 20 న అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి వస్తారు.

Tags:    

Similar News