JD Vance: గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రానా అమెరికాలో శాశ్వత నివాసం వచ్చినట్లు కాదు: JD వ్యాన్స్
JD Vance America Green card: గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఇతర దేశస్తులు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండొచ్చని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలనం వ్యాఖ్యలు చేశారు.

JD Vance: గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రానా అమెరికాలో శాశ్వత నివాసం వచ్చినట్లు కాదు: JD వ్యాన్స్
JD Vance America Green card: గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఇతర దేశస్తులు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండొచ్చని కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ ఈ సంచలనం వ్యాఖ్యలు చేయడంతో అమెరికా కళ మరింత దూరమయ్యేలా ఉంది.
ఓ మీడియా ఛానల్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసం పొందే హక్కు ఇతర దేశస్తులకు లేదని సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఇక్కడ ఏ పౌరులు ఉండాలో అని నిర్ణయించేది మేము అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జన్మతః పౌరసత్వం రద్దుపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కిందిస్థాయి కోర్టులు వాటిని నిలిపివేశాయి. వాటిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు డోనాల్డ్ ట్రంప్. సొలిసిటర్ జనరల్ సారా ఈ పిటిషన్ సాధారణమైనదిగా అభివర్ణించింది. ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం చేయాలని న్యాయస్థానాన్ని కోరింది.
గత కొన్నేళ్లుగా అమెరికా చట్టం ప్రకారం అక్కడ పుట్టిన బిడ్డ ఏ దేశానికి చెందినా అమెరికా పౌరసత్వం లభించేది. ఈ నేపథ్యంలో చాలామంది పౌరసత్వం పొందారు. అయితే ఆ విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రద్దు చేయాలని ఆలోచనలో ఉన్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం లేకున్నా కొన్ని పరిస్థితుల్లో అక్కడ బిడ్డ జన్మిస్తే జన్మతః పౌరసత్వం లభించేది. ఈ విధానాన్ని బ్రేక్ చేయాలని డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు ఎక్కువ శాతం భారతీయులకు ఈ పౌరసత్వం లభించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటికే గ్రీన్ కార్డుకు పోటీగా ట్రంప్ 'గోల్డ్ కార్డు' విధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు మిలియన్ల డాలర్లు చెల్లించి ఎవరైనా గ్రీన్ కార్డును కొనుగోలు చేయవచ్చని.. కంపెనీలు కూడా విదేశీ ఉద్యోగుల కోసం గోల్డ్ కార్డు కొనుగోలు చేసి దేశానికి రప్పించవచ్చని సూచించారు. అమెరికా వర్క్ వీసాల జాబితాలో భారత్ టాప్ లో ఉంది. ఐదు మిలియన్ డాలర్స్ అంటే గోల్డ్ కార్డు పొందాలంటే ఇండియన్ రూపాయల్లో దాదాపు రూ.40 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను తమ దేశానికి రప్పించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు.