Kuwait Currency: కువైట్‌లో రూ.15 వేలు సంపాదిస్తే చాలు.. ఇండియన్‌ కరెన్సీలో ఎంత రిటర్న్‌ వస్తుందంటే?

Update: 2025-03-13 10:30 GMT

Kuwait Currency: ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా. తెలియకుంటే తెలుసుకోండి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దీనార్. నేడు ఒక కువైట్ దీనార్ భారత కరెన్సీలో సుమారు రూ. 215లకు సమానం. Vice.com నివేదిక ప్రకారం, భారత రూపాయిలో కువైట్ దీనార్ విలువ దాదాపు రూ.283.72. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా నిలిచింది.

కువైట్ బలమైన ఆర్థిక వ్యవస్థ, చమురు ఎగుమతులు, పన్ను రహిత వ్యవస్థ కారణంగా కువైట్ దీనార్ చాలా విలువైనదిగా మార్చాయి. కువైట్ చమురు ఎగుమతి చేసే ప్రధాన దేశం.కువైట్ చమురు నిల్వలు ఈ కరెన్సీని చాలా స్థిరంగా ఉంచడంలో చాలా సహాయకారిగా ఉన్నాయి. కువైట్ కరెన్సీని దిర్హామ్ అంటారు. కువైట్‌లో ఉపాధి కోసం లక్షలాది మంది భారతీయులు అక్కడికి పనికి వెళతారు. ఒక భారతీయుడు కువైట్‌లో 15 వేల దిర్హామ్‌లు సంపాదిస్తే భారతదేశంలో అతని విలువ 42 లక్షల 55 వేలు అవుతుంది.

కువైట్ దినార్ తో పోలిస్తే అమెరికా డాలర్ తక్కువ. 1 కువైట్ దినార్ విలువ 3.32 అమెరికన్ డాలర్లకు సమానం. అంటే మీరు ఒక కువైట్ దినార్‌ను మార్చుకుంటే, మీకు 3.32 USD లభిస్తుంది. కువైట్ దినార్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన కరెన్సీ బహ్రెయిన్ దినార్. బహ్రెయిన్ కూడా ఒక ప్రధాన చమురు ఎగుమతి చేసే దేశం. దాని కరెన్సీకి అంతర్జాతీయంగా కూడా అధిక డిమాండ్ ఉంది.

అయితే కువైట్ దినార్ 1959 వరకు భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లో తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశపెట్టింది. తర్వాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతరం చెందింది. 1990 ఇరాక్ చెర నుంచి కువైట్ విముక్తి పొందినప్పటి నుంచి ఫిబ్రవరి 25, 26ను లిబరేషన్ డే గా జరుపుకుంటుంది. 

Tags:    

Similar News