సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం: స్పేస్ ఎక్స్ 10 మిషన్ ప్రయోగం మళ్లీ ఎప్పుడు?

Sunita Williams: సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది.

Update: 2025-03-13 06:18 GMT

సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం: స్పేస్ ఎక్స్ 10 మిషన్ ప్రయోగం మళ్లీ ఎప్పుడు?

Sunita Williams: సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది. నాసా ప్రయోగించిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ వాయిదా పడింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరే ముందు టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది. సునీతా విలియమ్స్, విల్ మోర్ ను ఎప్పుడు భూమి మీదకు తీసుకువస్తారోననే చర్చ మళ్లీ తెరమీదికి వచ్చింది.

స్పేస్ ఎక్స్ 10 మిషన్ ఎందుకు వాయిదా పడింది?

సునీతా విలియమ్స్, విల్ మోర్ ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తీసుకు వచ్చేందుకు స్పేస్ ఎక్స్ మిషన్ 10 ప్రయోగాన్ని మార్చి 12న ప్రారంభించింది. ఈ మిషన్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరడానికి ముందే హైడ్రాలిక్ సిస్టమ్ లో టెక్నికల్ సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. రాకెట్ పై భాగాన్ని పట్టుకొని ఉండే రెండు కాంప్ లలో ఒక్కదాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య వచ్చిందని నాసా తెలిపింది. గ్రౌండ్ సిస్టమ్ లో సమస్య కారణంగా ఈ ప్రయోగం రద్దు చేయాల్సి వచ్చింది. మార్చి 12 రాత్రి 7.48గంటలకు ప్రయోగం చేయాల్సి ఉంది. అయితే ఏడు గంటలకే ప్రయోగం వాయిదా వేస్తున్నట్టు నాసా ప్రకటించింది.

మళ్లీ ఎప్పుడు ప్రయోగం చేస్తారు?

స్పేస్ ఎక్స్ 10 మిషన్ ప్రయోగం ఎప్పుడు చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. స్పేస్ ఎక్స్ నిపుణులతో నాసా శాస్త్రవేత్తలతో చర్చించిన తర్వాత తదుపరి ప్రయోగం ఎప్పుడు చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు. వారం రోజుల్లోపునే తర్వాత ప్రయోగం చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. స్పేస్ ఎక్స్ 10 మిషన్ లో భాగంగా నికోల్ అయర్స్, అన్నే మెక్ కెయిన్, టకుయా ఒనిషి, రోస్కోస్కోప్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ ‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.

సునీతా విలియమ్స్ ఎలా చిక్కుకున్నారు?

సునీతా విలియమ్స్, విల్ మోర్ 2024 జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో వీరిద్దరూ అంతరిక్షానికి వెళ్లారు. విమానంలో పర్యాటక ప్రదేశానికి వెళ్లినట్టే అంతరిక్షంలోకి వ్యోమనౌకలో వెళ్లే ప్రయోగంలో భాగంగా సునీతా విలియమ్స్, విల్ మోర్ అంతరిక్షానికి చేరుకున్నారు. స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలతో సునీతా విలియమ్స్ , విల్ మోర్ అంతరిక్షంలో చిక్కుకున్నారు.

Tags:    

Similar News