Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్..భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్

Update: 2025-03-15 02:30 GMT
Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్..భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్
  • whatsapp icon

 Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ తాజాగా క్రూ 10 మిషన్ చేపట్టింది. నాసా స్పేస్ ఎక్స్ లు తాజాగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.

దాదాపు 9 నెలలుగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు మూడు నెలల క్రితం క్రూ 10 మిషన్ ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపివేశారు. తాజాగా వారిని తీసుకువచ్చేందుకు మళ్లీ ప్రయోగించారు. డ్రాగన్ క్యాప్సుల్స్ లో ఐఎస్ఎస్ కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు. 

Tags:    

Similar News