క్లబ్‌లో అగ్ని ప్రమాదం.. 51 మంది మృతి, మరో 100 మందికి గాయాలు

Update: 2025-03-16 11:09 GMT

North Macedonia's fire acident: నైట్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం.. 51 మంది మృతి, మరో 100 మందికి గాయాలు

North Macedonia's fire acident: ఉత్తర మేసిడొనియాలోని కొకని పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక నైట్ క్లబ్‌లో చెలరేగిన మంటలు క్షణాల్లో క్లబ్ అంతా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 51 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. కొకనిలో అర్థరాత్రి 2:35 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. స్థానిక పాప్ గ్రూప్ నిర్వహిస్తూన్న లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.

ఈ లైవ్ కన్సర్ట్ జరుగుతున్న సమయంలో కొంతమంది యువకులు పైరోటెక్నిక్స్ కాల్చారు. దీంతో పై కప్పుకు ఆ మంటలు అంటుకుని అగ్ని ప్రమాదానికి దారితీసిందని ఉత్తర మేసిడోనియా మంత్రి పంచె తోష్‌కువోస్కి తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేసిడోనియాకు ఇది ఒక దురదృష్టకరమైన రోజు అని ఆ దేశ ప్రధాని హ్రిస్టిజన్ మికోస్కి తెలిపారు. పదుల సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోయారని, వారి మృతి ఆ కుటుంబాలకు తీరని లోటు అని మికోస్కి ప్రకటించారు.

ఈ కష్టకాలంలో బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తుందని మికోస్కి అన్నారు. 

Tags:    

Similar News