Abu Qatal killed in Pakistan: 26/11 ముంబై ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం

Abu Qatal killed in Pakistan: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు.

Update: 2025-03-16 03:52 GMT

Abu Qatal killed in Pakistan: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అబూ కటల్ భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. సైన్యంతో సహా భద్రతా సంస్థలకు పెద్ద ముప్పుగా ఉన్న సంగతి తెలిసిందే.

అబూ కతల్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు చాలా సన్నిహితుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. ముంబైలోని అనేక చోట్ల 10 మంది లష్కరే ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్లకు పాల్పడిన ఈ భయంకరమైన దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఇది రెండు దేశాల మధ్య యుద్ధంలాంటి పరిస్థితిని సృష్టించిన సంగతి తెలిసిందే.

జనవరి 2023లో, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఐదుగురు వ్యక్తులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీరిలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. రాజౌరిలోని ధంగ్రి గ్రామంలో జనవరి 1, 2023న ఈ దాడి జరిగింది. అక్కడ ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. మరుసటి రోజే, ఒక IED పేలుడు సంభవించి, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

చార్జిషీట్‌లో పేర్కొన్న ముగ్గురు ప్రధాన ఉగ్రవాదులను లష్కరే తోయిబా కీలక సభ్యులుగా గుర్తించారు. వీరిలో సైఫుల్లా అలియాస్ సాజిద్ జాట్, మొహమ్మద్ ఖాసిం అబూ కటల్ అలియాస్ కటల్ సింధీ ఉన్నారు. అబూ కటల్, సాజిద్ జాట్ పాకిస్తానీ పౌరులు కాగా, మహ్మద్ ఖాసిం 2002లో పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి లష్కర్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లో చేరాడు. ఈ దాడిని జమ్మూ కాశ్మీర్‌లో అశాంతిని వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద కుట్ర పన్నారు.

జూన్ 9న జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని శివ్ ఖోరి ఆలయం నుండి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో అతను కీలక పాత్ర పోషించాడు. ఈ దాడి కటల్ నాయకత్వంలోనే జరిగింది. అబూ ఖతల్‌ను లష్కర్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా నియమించింది హఫీజ్ సయీద్. హఫీజ్ సయీద్ అబూ ఖతల్ కు ఆదేశాలు ఇచ్చేవాడు. తరువాత అతను కాశ్మీర్ లో పెద్దెత్తున దాడులకు తెగబడ్డాడు. 

Tags:    

Similar News