India Speech At UN: అంతర్జాతీయ వేదికగా భారత్ పై నిందలేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది భారత్. సంబంధంలేని అంశాల్లోకి కాశ్మీర్ ప్రస్తావనను తీసుకువచ్చిన పాక్ క భారత్ గట్టిగా బదులిచ్చింది. ఆ దేశానిది మతోన్మాద మనస్తత్వం అంటూ దుయ్యబట్టింది. ఇలాంటి వ్యాఖ్యలతో అబద్ధాలను నిజం చేయలేరని సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చురకలంటించింది భారత్ .
అంతర్జాతీయ ఇస్లామోఫోబియా నిర్మూలన దినం సందర్బంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ ప్రతినిధి, ఆ దేశ విదేశాంగ మాజీ కార్యదర్శి నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ ప్రతినిధి, ఆ దేశ విదేశాంగ శాక మాజీ కార్యదర్శి తెహ్ మినా జంజువా మాట్లాడుతూ..కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితికి శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు.
నిజానికి, శుక్రవారం 14 మార్చి 2025న, 'అంతర్జాతీయ ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి దినోత్సవం' సందర్భంగా ఐక్యరాజ్యసమితి (UN)లో అనధికారిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. దీనిలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువా జమ్మూ, కాశ్మీర్ గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి, భారతదేశ శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పాకిస్తాన్‌ను మందలించి, విమర్శించారు. 'తన అలవాటు ప్రకారం, పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి ఈరోజు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి అనుచితమైన సూచన చేశారు' అని అన్నారు.
భారత శాశ్వత ప్రతినిధి రాయబారి పి హరీష్ చేసిన ఈ బలమైన ప్రసంగాన్ని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్ ఎంతో ప్రశంసించింది. 'భారతదేశం వైవిధ్యం బహుత్వానికి నిలయం అని హరీష్ హైలైట్ చేశారు' అని పర్మనెంట్ మిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ముస్లిం దేశాలలో ఒకటి, ఇక్కడ 200 మిలియన్లకు పైగా ముస్లిం జనాభా ఉంది. ముస్లింలపై మతపరమైన అసహనం సంఘటనలను ఖండించడంలో ఇది ఐక్యరాజ్యసమితితో ఐక్యంగా నిలుస్తుంది.