అమెరికాలో భారతీయ విద్యార్ధిని వీసా రద్దు: ఎవరీ రంజనీ శ్రీనివాసన్?

Ranjani Srinivasan: అమెరికా కొలంబియా యూనివర్శిటీలో చదువుకుంటున్న భారత్ కు చెందిన రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు అయింది.

Update: 2025-03-15 06:52 GMT

అమెరికాలో భారతీయ విద్యార్ధిని వీసా రద్దు: ఎవరీ రంజనీ శ్రీనివాసన్?

Ranjani Srinivasan: అమెరికా కొలంబియా యూనివర్శిటీలో చదువుకుంటున్న భారత్ కు చెందిన రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు అయింది. రంజనీ శ్రీనివాసన్ ఎఫ్ 1 వీసాపై అమెరికాలో ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్ధులు నిరసనలకు దిగారు. ఈ నిరసనలకు రంజనీ శ్రీనివాసన్ పై ఆరోపణలున్నాయి. దీంతో ఆమె వీసాను రద్దు చేశారు. స్వీయ బహిష్కరణకు గురైనట్టు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. మార్చి 5 నుంచి రంజనీ వీసాను రద్దు చేసినట్టు అమెరికా అధికారులు తెలిపారు. సీబీపీ హోమ్ అనే యాప్ ను ఉపయోగించి మార్చి 11న స్వీయ బహిష్కరణకు గురైనట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది.

ఎవరీ రంజనీ శ్రీనివాసన్?

భారత్ కు చెందిన రంజనీ శ్రీనివాసన్. కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్బన్ ప్లానింగ్ లో చదువుతున్నారు. ఇందుకోసం ఆమెకు అమెరికా ప్రభుత్వం ఎఫ్ 1 వీసా మంజూరు చేసింది. ఈ వీసాతో ఆమె ఈ యూనివర్శిటీలో చేరారు. ఈ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ప్రిజర్వేషన్ జీఎస్ఏ‌పీపీ నుంచి అర్బన్ ప్లానింగ్ లో ఎంఫిఎల్ పట్టా పొందారు. అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలీ సీఈపీటీ యూనివర్శిటీ నుంచి ఆమె బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని పొందారు.వాతావరణ మార్పులతో వచ్చే ప్రమాదాలపై మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వెస్ట్ ఫిలడెల్పియాల్యాండ్ స్కేప్ ప్రాజెక్టు డబ్ల్యుపీఎల్‌పీ లో ఆమె పరిశోధనలు చేశారు.

సీబీపీ యాప్‌తో స్వచ్ఛంధంగా అమెరికా వీడేందుకు ఛాన్స్

అమెరికా ప్రభుత్వం ఇటీవలనే సీబీపీ అనే యాప్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్స్, ఆపిల్ స్టోర్స్ ద్వారా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ యాప్‌ను ఉపయోగించి స్వచ్ఛంధంగా అమెరికా వీడే అవకాశం కూడా వీలు కల్పించింది. డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఒక ప్రకటన విడుదల చేశారు.అమెరికాలో ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిరసనలు చేస్తే వీసాను రద్దు చేస్తామని డీహెచ్ఎస్ తెలిపింది. కొలంబియా యూనివర్శిటీ విద్యార్ధి సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించినందుకు సంతోషిస్తున్నానని క్రిస్టీ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News