టెర్రరిజంపై జుగల్బందీ... ఏందీ హౌడీ మోడీ!!

ట్రంప్ భుజాలపై తుపాకీ పెట్టి మోడీ... పాకిస్థాన్ ని కాల్చారా? పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న రాడికల్ టెర్రరిజాన్ని పేల్చారా? అమెరికా హోస్టన్ అంతర్జాతీయ వేదికగా భారత్-అమెరికా మైత్రీ బంధం మరింత గట్టి పడిందా? అంతే స్థాయిలో పాక్ నిర్వీర్యమైందా? అసలు హౌడీ మోడీకి ట్రంప్ ఎందుకువచ్చారు? హోస్టన్ ఎన్ఆర్ జి స్టేడియం లో జరిగిన భారీ సమ్మిళిత సాంస్కృతిక ర్యాలీ బాగా సక్సెస్ అయింది.

Update: 2019-09-25 06:04 GMT

ట్రంప్ భుజాలపై తుపాకీ పెట్టి మోడీ... పాకిస్థాన్ ని కాల్చారా? పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న రాడికల్ టెర్రరిజాన్ని పేల్చారా? అమెరికా హోస్టన్ అంతర్జాతీయ వేదికగా భారత్-అమెరికా మైత్రీ బంధం మరింత గట్టి పడిందా? అంతే స్థాయిలో పాక్ నిర్వీర్యమైందా? అసలు హౌడీ మోడీకి ట్రంప్ ఎందుకువచ్చారు? హోస్టన్ ఎన్ఆర్ జి స్టేడియం లో జరిగిన భారీ సమ్మిళిత సాంస్కృతిక ర్యాలీ బాగా సక్సెస్ అయింది. 50వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొన్న హౌడీ... మోడీ కార్యక్రమంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి గెస్టుగా వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, టెక్నికల్ గా కేవలం హోస్ట్ గానే కనిపించారు. అయితే ఈ సభని అటు మోడీ, ఇటు ట్రంప్ తమకు అనుకూలంగా మల్చుకున్నారు. ఇద్దరూ అమెరికా-భారత్ జుగల్బందీ ని చాటారు. పాకిస్థాన్ లేదా పాక్ ప్రధాని ఇమ్రాన్ పేరు కూడా ఎత్తకుండానే... రాడికల్ టెర్రరిజం ని కలిసి ఎదుర్కొంటామని ప్రకటించారు.

హౌడీ మోడీ వ్యూహత్మక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించడం. మోడీ హాజరవడం... ప్రవాస భారతీయులు నిర్వహిస్తున్న హౌడీ మోడీకి ట్రంప్ రావడం అటు మోడీకి, ఇటు ట్రంప్ కి లాభం కలిగించే అంశం. అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం కావడంతో ట్రంప్ కి ప్రవాస భారతీయుల ఓట్లు కీలకం కానున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే మోడీ సైతం అబ్ కీ బార్... ట్రంప్ సర్కార్... అంటూ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ ఓట్లని ట్రంప్ కే వేయాలని ప్రవాస భారతీయులకు చెప్పారు. ట్రంప్ ఈ కార్యక్రమానికి రావడం ద్వారా తమ సంపూర్ణ మద్దతుని భారత్ కి, అమెరికాలోని ప్రవాస భారతీయులకు ప్రకటించినట్లే. ఇక ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా చేస్తున్న ప్రయత్నాలకు భారత్, భారీగా గండి కొట్టడమే. పైగా భారత్-అమెరికా స్నేహ బంధం గట్టిపడ్డట్లే. అందుకే ట్రంప్ మాట్లాడుతూ, భారత్-అమెరికా స్వప్నాలు సాకారం చేసేందుకు మోడీతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

ట్రంప్ హౌడీ మోడీని విస్మరించకపోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. 2019 నాటికి 272 మిలియన్ ప్రజలు అంతర్జాతీయ ప్రవాసులు. ఇందులో 17.5 మిలియన్ల ప్రవాసులతో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. రేపటి ఎన్నికల్లో ట్రంప్ కి ఈ ఓట్లే కీలకం కానున్నాయి. పాక్ టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి అగ్రరాజ్య మద్దతు మోడీకి అవసరం. అంటే...మోడీ మద్దతు ట్రంప్ కి, ట్రంప్ మద్దతు మోడీకి అన్నమాట. ఫైనల్ గా భారత్-అమెరికాలు జోర్దార్ ఖాస్ దోస్తులై పోయాయి. హౌడీ... మోడీ భారత్-అమెరికా జుగల్బందీనే కాదు...రెండు దేశాల స్నేహంలో కొత్త సువర్ణధ్యాయాన్ని చాటింది. అంతకంటే టెర్రరిజంపై రెండు దేశాల యుద్ధాన్ని ప్రకటించాయి. వీటన్నింటికంటే...భారత ప్రధాని మోడీ... తన తుపాకీని... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భుజాలపై మోపి, పాకిస్థాన్ ని టార్గెట్ చేశాడని తేల్చేసింది. అంతర్జాతీయంగా పాక్, ఇక ఒంటరే. 

Tags:    

Similar News