Vladimir Putin: ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేది లేదన్న పుతిన్
Vladimir Putin: రష్యాను ఒంటరిని చేసేదుకు యత్నిస్తున్నట్టు విమర్శలు
Vladimir Putin: ఉక్రెయిన్- రష్యా యుద్ధం 200 రోజులకు చేరువవుతోంది. వార్ బిగిన్ అయినప్పటి నుంచి పశ్చిమ దేశాలు భారీగా ఆంక్షలను విధించాయి. ఫిబ్రవరి 24న తరువాత రష్యాపై ఏకంగా 9వేల 202 ఆంక్షలను వెస్ట్ కంట్రీస్ విధించాయి. మొత్తం 11వేల 897 ఆంక్షలు రష్యాపై ఉన్నాయి. నిజానికి ఈ ఆంక్షలతో క్రెమ్లిన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవ్వాలి. ఆ దేశం దివాళా తీయాలి. కానీ రష్యా విషయంలో అలా జరగలేదు. పశ్చిమ దేశాలు వేసిన అంచనా దారుణంగా ప్లాప్ అయింది. పాశ్యాత్య ఆర్థిక, సాంకేతిక దాడితో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తాజాగా పుతిన్ తెలిపారు. రష్యాను ఒంటరిని చేసేందుకు ఆయా దేశాలు యత్నిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఆ ఆంక్షలు వేస్ట్ అన్నట్టుగా వ్యాఖ్యానించారు.
లక్ష్యం సాధించేవరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షలను విధించి.. రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు యత్నిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. తమ చర్యలన్నీ డాన్‌బాస్ ప్రాంతంలోని ప్రజలను రక్షించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. పాశ్చత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో నేపథ్యంలో రష్యా తన సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేసినట్టు వివరించారు. పాశ్చాత్య ఆర్థిక, సాంకేతిక దాడికి ప్రతి స్పందించామన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల కారణంగా తాము ఏమీ నష్టపోలేదని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యాపై కఠిన ఆంక్షలను విధించింది. ఆ ఆంక్షలు వేస్ట్ అంటున్నారు పుతిన్ ఆంక్షలు విధించిన దేశాలే నష్టపోతాయని ముందు నుంచి పుతిన్ చెబుతున్నారు. ఇప్పుడు కూడా క్రెమ్లిన్ అధినేత నోట అదే మాట వచ్చింది. నిజానికి ఫిబ్రవరి 24కు ముందు రష్యాపై 2వేల 695 ఆంక్షలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపాన్ని ఆక్రమించుకోవడంతో విధించినవే.. ఫిబ్రవరి 24 తరువాత రష్యాపై ఎన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు విధించాయి? ఏయే దేశాలు అధిక ఆంక్షలను విధించాయి?
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. దీనికి నిరసనగా ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నట్టు పశ్చిమ దేశాలు ప్రకటించాయి. ఐరోపాపై దూకుడుగా వ్యవహరించే రష్యాపై ఎప్పటి నుంచో పశ్చిమ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో అదే అదునుగా రెచ్చిపోయాయి. భారీ ఆంక్షలను విధిస్తే.. మాస్కో చతికిల పడుతుందని భావించాయి. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలను ఇవ్వడంతో క్రెమ్లిన్ దెబ్బతిని యుద్ధాన్ని ఆపేస్తుందని వెస్ట్ కంట్రీస్ అంచనా వేశాయి. ఫిబ్రవరి 24కు ముందు 2వేల 695 ఆంక్షలు మాత్రమే ఉండేవి. యుద్ధం ప్రారంభమైన తరువాత.. ఏకంగా.. పాశ్చాత్య 9 వేల 202 ఆంక్షలను విధించాయి. ఇందులో అత్యధికంగా స్విట్జర్లాండ్ 13 వందల 62 ఆంక్షలను, అమెరికా 13వందలు, కెనడా, 12వందల 97, యూకే 12 వందల 82, ఐరోపా 11వందల 43, ప్రాన్స్ వెయ్యి 82, ఆస్ట్రేలియా 946, జపాన్ 790 ఆంక్షలను రష్యాపై విధించాయి. ప్రస్తుతం మాస్కోపై మొత్తం 11వేల 897 ఆంక్షలు ఉన్నాయి. నిజానికి ఈ ఆంక్షలతో ఏ దేశమైనా అస్తవ్యస్తం అవ్వాల్సిందే. కానీ.. రష్యా విషయంలో పశ్చిమ దేశాలు ఊహించుకున్నదొకటి జరుగుతున్నది మరొకటి అన్ని ఆంక్షలను విధించినా.. రష్యా తట్టుకుని ఎలా నిలబడగలిగింది? అందుకు ఏయే దేశాలు సహకరిస్తున్నాయి?
రష్యా వద్ద విస్తారమైన చమురు, సహజ వాయువుల నిక్షేపాలు ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు.. రష్యా చమురుపైనే ఆధారపడుతున్నాయి. ఆ దేశాలకు 2021లో 40 శాతం సహజవాయువును రష్యా ఎగుమతి చేసింది. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది కూడా అంతే సఫరా చేయాల్సి ఉంది.. అయితే మరమ్మతుల పేరుతో మాస్కో గ్యాస్ ఎగుమతిని సగానికి పైగా తగ్గించింది. అదే సమయంలో ఆంక్షలను తట్టుకోవడంపై క్రెమ్లిన్ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు భారీ ఆంక్షలు ఉన్న ఇరాన్, ఉత్తర కొరియాలో రష్యన్ అధికారులు పరిశీలించారు. అంతేకాదు.. విస్తారమైన మార్కెట్ ఉన్న ఆసియా దేశాలపై దృష్టి సారించింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకంటే తక్కువకే ఇస్తానని ఆఫర్లు ప్రకటించింది. దీంతో భారత్, చైనా వంటి దేశాలు రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాదు.. ఇరాన్, చైనాను వేదికగా చేసుకుని.. ఏ దేశాలైతే ఆంక్షలు విధించాయో.. అదే దేశాలకు భారీ ధరలకు రష్యా చమురును విక్రయిస్తోంది. దీంతో రష్యా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ఫిబ్రవరి 24 తరువాత రూబుల్ మరింత బలోపేతమైంది. ఫలితంగా.. పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించినా.. రష్యాకు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు.. అదే విషమే పుతిన్ స్పష్టంగా చెప్పారు. తమకు ఎలాంటి నష్టం లేదని ధీమాగా చెబుతున్నారు. పుతిన్ చెబుతున్నట్టుగానే రష్యాలోని ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు.
రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే చమురు, గ్యాస్ వ్యాపారాలు ఆంక్షల కిందికి రావు. ఈ విషయమే భారత్ పదే పదే చెప్పింది. ఆ తరువాత.. ఉక్రెయిన్‌కు ద్రోహం అన్న మాటను తెరపైకి తెస్తున్నాయి. అయినా.. ఆయా దేశాలు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. అమెరికాతో సన్నిహితంగా ఉన్నా.. రష్యా చమురు, గ్యాస్, ఆయుధాలను దిగుమతికి ఇతర దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం టర్కీ. ఐరోపా, నాటో కూటముల్లో టర్కీ ఉన్నా.. రష్యాతో మాత్రం సన్నిహిత సంబంధాలనే నెరపుతోంది. దీంతో ఆంక్షలు నీరుగారుతున్నాయని పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆయా దేశాలు కూడా రష్యాతో ఇప్పటికిప్పుడు సంబంధాలను తెంచుకోలేదు. ఒప్పందం ప్రకారం గ్యాస్‌ను ఈ ఏడాది చివరికి వరకు సరఫరా చేస్తోంది. అయితే అప్పటిలోగా రష్యా కొత్త కొనుగోలుదారుల కోసం ప్రయత్నించేందుకు తగిన సమయం ఉంది. దీంతో ఆంక్షలపై రష్యా ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. కేవలం ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు సైనిక, ఆయుధ నష్టాలు మాత్రమే వాటిల్లాయి. అంతకుమించి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు.
ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం.. 200 రోజులకు చేరువుతోంది. ఈ యుద్ధంలో రష్యా దక్షిణాదిలోని ఖేర్సన్, మరియూపోల్, తూర్పున లుహన్‌స్క్ ప్రాంతాలను దక్కించుకుంది. ఈ ప్రాంతాలు రష్యాకు అత్యంత కీలకమైనవి. మరోవైపు ఒడెసా ప్రాంతాన్ని సొంతం చేసుకునేందుకు మాస్కో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఆక్రమిత ప్రాంతాలను తిగిరి దక్కించుకునేందుకు ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ యుద్ధం కారణంగా.. ఉక్రెయిన్‌కు చెందిన 15వేల మంది సైనికులు, రష్యాకు చెందిన 50 వేలమంది సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే రష్యా మాత్రం ఇప్పటివరకు సైనికుల మృతిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం.