Kili Paul: షార్ట్స్ స్టార్ కిలీపాల్‌పై హత్యాయత్నం
Kili Paul: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో షార్ట్స్‌తో హోరెత్తిస్తున్న టాంజానియాకు చెందిన కిలీ పాల్
Kili Paul: అతడు ఏం చేసినా నవ్వులు పూయిస్తుంది. లైక్‌లు, కామెంట్లు, షేరింగులతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ షేక్ అవుతున్నాయి. వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు శరీరంపై గాయాలతో ఇప్పుడు ఆసుపత్రిలో స్ట్రెచర్‌పై దీనస్థితిలో ఉన్నాడు. అతడు ఎవరో కాదు. యూట్యూబ్ సెన్సేషన్‌గా ఫేమస్ అయిన కిలీ పాల్. టాంజానియాకు చెందిన అతడిపై కత్తులు, కర్రలతో గుర్తుతెలియని హత్యాయత్నానికి పాల్పడ్డారు.
కిలీ పాల్ తన చెల్లి నీమాపాల్‌తో కలిసి బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు, అబ్బురపరిచే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నారు,. కిలీ పాల్ స్టెప్పులను చూసి పల్లెల్లో పిల్లల దగ్గర నుంచి బాలీవుడ్‌స్టార్స్, ప్రముఖల దాకా ఫ్యాన్స్ అయ్యారు. తక్కువ టైమ్‌లో గుర్తింపు దక్కిన పాల్‌ను భారత్ హైకమిషన్ ప్రత్యేక గుర్తింపుతో గౌరవించింది.
అంతేకాదు ప్రధాని మోదీ సైతం కిలీ బాల్ గురించి మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు కూడా. తాజాగా కిలీ పాల్‌పై కొందరు దుండగులు దాడికి దిగారు. కొందరు తనపై కక్షగట్టి దాడి చేశారని దేవుడు మాత్రం సాయం చేస్తాడని నాకోసం ప్రార్థించడండంటూ కిలీపాల్ పోస్టు చేశాడు. అయితే అతడిపై ఎందుకు హత్యాయత్నం జరిగింది? ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.