ఉక్రెయిన్‌పై రష్యా దాడులు నిలిపివేయాలని UNGAలో తీర్మానం...
UNGA: *ఓటింగ్‌లో పాల్గొని మద్దతు తెలిపిన 141 దేశాలు, రష్యాకు మద్దతుగా ఐదు దేశాలు *ఓటింగ్‌కు దూరంగా భారత్ సహా 35 దేశాలు
United Nations General Assembly: ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఓటింగ్ నిర్వహించారు. రష్యా దాడులు నిలిపివేయాలని, రష్యా బలగాలను వెనక్కి రప్పించాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో తీర్మానించారు. అయితే.. ఓటింగ్‌లో పాల్గొని 141 దేశాలు మద్దతు తెలపగా.. రష్యాకు మద్దతుగా ఐదు దేశాలు ఓట్ వేశాయి. UNGA తీర్మానం సందర్భంగా.. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.