ఆఫ్ఘనిస్తాన్ లో.. 6500 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు : యుఎన్‌ఎస్‌సి నివేదిక
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి) నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్థాన్‌కు 6500 మంది ఉగ్రవాదులు ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి) నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్థాన్‌కు 6500 మంది ఉగ్రవాదులు ఉన్నారు. వారిలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల ఉగ్రవాదులు ఉన్నారని యుఎన్‌ఎస్‌సి తన నివేదికలో పేర్కొంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ ఉగ్రవాదులు ఉండటం ఆందోళన కలిగించే విషయమని భారత విదేశాంగ శాఖ చెప్పింది. ఐక్యరాజ్యసమితి యొక్క ఈ నివేదిక అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రమనే అభిప్రాయాన్ని రుజువు చేసిందని అభిప్రాయపడింది.
యుఎన్‌ఎస్‌సి నివేదికపై భారత్ ఏమి చెప్పిందంటే?
పాకిస్తాన్ ఇప్పటికీ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉందని యుఎన్‌ఎస్‌సి నివేదిక రుజువు చేస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన మద్దతును నిషేధించిన ఉగ్రవాద సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయని పేర్కొంది.
పాకిస్తాన్.. ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం, ఉగ్రవాద సంస్థలు పలువురిని ఇక్కడ నియమించుకుని శిక్షణ ఇస్తున్నాయి. వారికి ఆర్థిక సహాయం చేయడమే గాక.. ప్రభుత్వ సహకారం కూడా ఉండటం వలన ఉగ్రవాదుల ఎటువంటి భయం లేకుండా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అని పేర్కొంది.
అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్థిరమైన, ప్రామాణికమైన చర్యలు తీసుకోవాలని.. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పడానికి చేసే ప్రతి ప్రయత్నానికి భారత్ తన సహకారం అందిస్తుందని చెప్పింది. అలాగే పాకిస్తాన్ తన అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.