పెరిగిన యూకే ప్రధాని రిషి సునాక్ దంపతుల సంపద : 651 మిలియన్ యూరోలకు చేరిక

యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతమూర్తి సంపద 651 మిలియన్ యూరోలకు చేరుకుంది. ఈ మేరకు సండే టైమ్స్ మే 17న రిచెస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది.

Update: 2024-05-18 13:51 GMT

పెరిగిన యూకే ప్రధాని రిషి సునాక్ దంపతుల సంపద : 651 మిలియన్ యూరోలకు చేరిక

యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతమూర్తి సంపద 651 మిలియన్ యూరోలకు చేరుకుంది. ఈ మేరకు సండే టైమ్స్ మే 17న రిచెస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. 2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 మిలియన్ యూరోలుగా ఉంది. ఏడాదిలో వీరి సంపద 651 మిలియన్ యూరోలకు చేరింది. ఇన్ఫోసిస్ షేర్స్ కారణంగానే ఈ దంపతుల సంపద పెరిగింది. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి కూతురే అక్షతమూర్తి.

సండే టైమ్స్ రిచెస్ట్ లిస్ట్ జాబితా ప్రకారంగా ప్రిన్స్ చార్లెస్ కంటే యూకే ప్రధాని రిషి సునాక్ సంపద ఎక్కువ.గత ఏడాది ప్రిన్స్ చార్లెస్ -3.... సునాక్ కుటుంబం కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నాడు. 2022లో క్వీన్ ఎలిజబెత్ కంటే సునాక్ అధిక సంపద కలిగి ఉన్నాడు.ఆ సమయంలో ఇంగ్లాండ్ రాణి సంపద 370 మిలియన్లుగా ఉంది. ఆ సమయంలో సునాక్ సంపద 730 మిలియన్ యూరోలు.

సునాక్ రాజకీయాల్లోకి రాకముందు హెడ్జ్ ఫండ్ మేనేజర్ గా పనిచేశాడు. వ్యక్తిగతంగా సంపన్నుడు. తాజాగా ఆయన దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ లో 2.2 మిలియన్ ఆదాయం వచ్చినట్టుగా చూపారని ఆ పత్రిక తెలిపింది.సునాక్ సంపదలో ప్రధానంగా ఆయన భార్య అక్షతమూర్తి నుండి వస్తుంది. ఇన్ఫోసిస్ షేర్స్ కారణంగా అక్షతమూర్తికి భారీగా ఆదాయం సమకూరుతుంది.గత ఏడాది 590 మిలియన్ యూరోలు ఇన్పోసిస్ షేర్లతో వచ్చినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News