Pakistan: చైనా పౌరులే లక్ష్యంగా కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు
Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు జరిగింది.
Pakistan: పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్తాన్ అంతటా ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న చైనా జాతీయులపై దాడులు నిర్వహించింది.. కాగా.. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
అనుమానిత ఐఈడీ వల్ల పేలుడు సంభవించిందని పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. స్థానికుల నివేదికల ప్రకారం... కరాచీ అంతటా ప్రజలు పేలుడు శబ్దాన్ని విన్నారు. పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన భారీ పేలుడులో ఇద్దరు చైనా జాతీయులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారని ఐజీ తెలిపారు.
జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ట్యాంకర్ పేలడంతో ఈ ఘటన జరిగిందని పాకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడి వారి కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌లో పనిచేస్తున్న చైనా పౌరులు, సంస్థలు ప్రాజెక్టుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మేము పాకిస్తాన్ అధికారులను కోరుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది.
సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజర్ మీడియాతో మాట్లాడుతూ అనుమానాస్పదమైన ఐఈడీ వల్ల పేలుడు సంభవించిందని, ఇందులో ఒక విదేశీయుడు కూడా గాయపడ్డాడని చెప్పారు.స్థానిక మీడియా నివేదికల ప్రకారం... నగరం అంతటా నివాసితులు పేలుడు శబ్దాన్ని విన్నారు.. ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. పేలుడులో గాయపడిన వారిని వైద్యచికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టెలివిజన్ ఫుటేజీలో పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలోని రహదారిపై పెద్ద మంటలు కనిపించడంతో ఆ ప్రాంతం నుంచి పొగలు పైకి లేచాయి. ఉత్తర నజీమాబాద్, కరీమాబాద్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పేలుడు శబ్దం వినిపించింది.