Donald Trump: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్..ఉపాధ్యక్ష పదవికి ఒహాయే సెనేటర్ జేడీ వాన్స్

Donald Trump:అమెరిక రిపబ్లికన్లు అధికారికంగా డొనాల్డ్ ట్రంప్‌ను పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేశారు. మాజీ అమెరికా అధ్యక్షుడు ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ను నవంబర్ 5 ఎన్నికలకు ముందు తన వైస్ ప్రెసిడెంట్ ఎంపికగా ఎంచుకున్నారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి సమ్మతించారు.

Update: 2024-07-16 00:31 GMT

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డివాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబరులో జరగబోయే ఎన్నికలకు పార్టీ తరపున కీలక నేతలు అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాయి. ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మదించిన తర్వాతే ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తని నిర్ణయించుకున్నాను.

మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలు అందించారు. ఒహాయే సేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు కూడా. యేల్ లా జర్నల్ కు సంపాదికుడి గా కూడా ఉన్నారు. ఆయన రచించిన హిల్ బిల్లీ ఎలెజీ పుస్తకం అత్యధికంగా అమ్ముడు అవ్వడంతో పాటు సినిమాగా రూపొందించింది. సాంకేతిక, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త ఆయన అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ ల్లో రాసుకొచ్చారు. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు సెలక్ట్ అయ్యాడు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చి చివరకు విధేయుడిగా మారారు. ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన ఒక రోజు తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ఖరారు కావడం గమనార్హం. 

Tags:    

Similar News